Breaking News

ఆర్థిక సర్వే 2025-26.. ముఖ్యాంశాలు

Published on Thu, 01/29/2026 - 13:24

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జనవరి 29, 2026) పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే 2025-26’ పత్రాన్ని ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌కు దిక్సూచిగా నిలిచే ఈ సర్వే భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని విశ్లేషించింది. కాసేపట్లో భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ మీడియా సమావేశం నిర్వహించి కీలక అంశాలను వివరించనున్నారు.

ఆర్థిక వృద్ధి అంచనాలు: సంస్కరణల ప్రభావం

  • ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది.

  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.4% గా ఉంటుందని ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి.

  • 2026-27 ఆర్థిక సంవత్సరంలో బలమైన స్థూల ఆర్థిక అంశాలు, వరుస నియంత్రణ సంస్కరణల వల్ల జీడీపీ వృద్ధి 6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.

  • ‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధి కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, కానీ నిరాశావాదం అక్కర్లేదు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. ఆహార ధరల ఒత్తిడి తగ్గింది’ అని సర్వేలో పేర్కొన్నారు.

  • ‘మేక్ ఇన్ ఇండియా 2.0’పై దృష్టి కేంద్రీకరించి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు.

  • డిజిటల్ ఎకానమీ.. డిజిటల్ పేమెంట్లు, ఫిన్‌టెక్, AI వినియోగం వేగంగా పెరుగుతూ, భారత్‌ను ప్రపంచ స్థాయి టెక్ హబ్‌గా మలుస్తోందన్నారు.

  • సౌర, వాయు, హైడ్రజన్ వంటి గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి, స్థిరమైన వృద్ధికి అనుకూలంగా పాలసీ మద్దతు కొనసాగుతోందని చెప్పారు.

  • మానవ కేంద్రిత సంస్కరణలు.. సాంకేతిక వినియోగాన్ని విస్తరించడంలో కూడా, సంక్షేమాన్ని కాపాడే విధంగా సంస్కరణలు పూర్తిగా మానవ కేంద్రితంగానే ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

  • ప్రపంచంలో భారత స్థానం.. భారతాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు “ఆశాకిరణం”గా వర్ణిస్తూ, గ్లోబల్ పెట్టుబడులు, దృష్టి భారత్‌వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, డిసెంబరులో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 2% వద్ద ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కేంద్రం నిర్దేశించిన 4% లక్ష్యం కంటే చాలా తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నామమాత్రపు జీడీపీ వృద్ధి 8% వద్ద ఉండొచ్చని అంచనా.

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో గుర్తుంచుకోవాల్సిన తేదీలు..

జనవరి 29: ఆర్థిక సర్వే 2025-26 సమర్పణ.

ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్.

ఏప్రిల్ 2: బడ్జెట్ సమావేశాల ముగింపు.

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ సావిత్రి బేబీ బంప్‌ స్టిల్స్ (ఫొటోలు)

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు