Breaking News

సుస్మితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: చిరంజీవి

Published on Mon, 01/26/2026 - 08:15

మనశంకర వరప్రసాద్‌ గారు మూవీ బ్లాక్‌బస్టర్‌ కావడంతో తాజాగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. చిత్ర యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్‌  ఈ వేడుకలో పాల్గొన్నారు. రెండువారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విజయం అందుకున్నారని చిరు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కూతురు సుస్మిత ఒక నిర్మాతగా పడిన కష్టం గురించి చిరు పలు విషయాలను పంచుకున్నారు.

సుస్మిత గురించి చిరంజీవి ఇలా అన్నారు. 'చరణ్‌ వద్ద సలహా తీసుకున్న తర్వాతే సుస్మిత ఇండస్ట్రీలోకి వచ్చింది. రంగస్థలం మూవీ కోసం కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన ఆమె ఒక నిర్మాతగా మరో అడుగు ముందుకు వేసింది. సుస్మిత అనుకుంటే ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయవచ్చు. కానీ, ఆమె మొదట వెబ్‌ సీరిస్‌లను నిర్మించి నిర్మాతగా పలు విషయాలను తెలుసుకుంది. ఆ తర్వాతే మరో నిర్మాత సాహు గారపాటితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ప్రయాణంలో ఆమెకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 

నిర్మాతలుగా వారిద్దరే చెరో సగం పెట్టుబడి పెట్టారు. డబ్బు అవసరం అయితే అప్పుగా తెచ్చుకుంది కానీ నన్ను ఎన్నడూ అడగలేదు. పలు దపాలుగా నా రెమ్యునరేషన్‌ కూడా సమయానికి ఇచ్చేశారు. కూతురుగా కాకుండా ఒక నిర్మాతగా చాలా ప్రొఫెషనల్‌గా సుస్మిత పనిచేసింది. ఈ మూవీకి చాలా డబ్బు పెట్టుబడి పెట్టి ఆమె విజయం సాధించడంతో ఒక తండ్రిగా నేను సంతోషిస్తున్నాను.' అని చిరు అన్నారు. ఆపై  ‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ గురించి మరిన్ని విషయాలను చిరు పంచుకున్నారు. పూర్తి వీడియోలో చూడండి.

Videos

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. జగన్ ట్వీట్

జాతీయ మీడియా ముందు ఏపీ పరువు తీస్తున్నారు!

ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు

మంచు తుఫాన్ బీభత్సం.. ఏడుగురు మృతి

అడిగింది చెప్పు.. ఎక్స్ట్రాలు చెయ్యకు.. క్లాస్ పీకిన చంద్రబాబు

రీల్స్ చేయను క్షమించండి..

టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..

20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం

తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్

కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..

Photos

+5

ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

'బిగ్‌బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)

+5

వికసించిన పద్మాలు

+5

Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)

+5

అనిల్‌ రావిపూడికి ఒక రేంజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు