Breaking News

టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం

Published on Sun, 01/25/2026 - 05:18

న్యూఢిల్లీ: టెక్నాలజీపై నియంత్రణ కలిగి ఉండడమే అసలైన సార్వభౌమత్వమని జోహో సంస్థ వ్యవస్థాపకుడు చీఫ్‌ సైంటిస్ట్‌ శ్రీధర్‌ వెంబు అభిప్రాయపడ్డారు. సాంకేతికాభివృద్ధితో ప్రపంచం పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశాలకు సాంకేతిక స్వయం ప్రతిపత్తి అత్యవసరమన్నారు. కేంద్రం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అజెండాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ లక్ష్యాల్లో తామూ భాగస్వామం కావడం ఆనందంగా ఉందన్నారు. జోహో పనితీరును కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సీఈవోలు ప్రశంసిస్తున్నారని శ్రీధర్‌ తెలిపారు.  

మాతృభూమి అవకాశాలతో ఎదురుచూస్తోంది ..  
అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, సుంకాలు, వీసా అనిశి్చతుల నేపథ్యంలో భారతీయ వృత్తి నిపుణులు మాతృ దేశానికి రావాలని వెంబు పిలుపునిచ్చారు. ఇక్కడి అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ ఇతర దేశాల్లో పనిచేస్తున్న భారత వృత్తి నిపుణులను కోరారు. ప్రపంచస్థాయి కంపెనీలు సైతం విస్తరణ వ్యూహాల్లో భాగంగా మనదేశంలోనే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. ‘దేశ జనాభా, విద్యా వ్యవస్థ, మౌలిక వసతులు, ప్రభుత్వ విధానాల సమ్మేళనం భారత్‌ టెక్‌ వ్యవస్థకు పరిపూర్ణ మద్దతు ఇస్తున్నాయ’ని శ్రీధర్‌ తెలిపారు.

ఐపీఓపై ఆసక్తి లేదు.. 
జోహో సంస్థను ఐపీఓ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లోకి తీసుకెళ్లే ఆసక్తి లేదని శ్రీధర్‌. సంస్థ ప్రైవేట్‌గా కొనసాగడం వల్ల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. త్రైమాసిక ఫలితాల ఒత్తిళ్లకు లోనవాల్సిన అవసరం లేదని, అలాంటి తాత్కలిక లక్ష్యాలు తమకు ఇష్టం లేదని చెప్పారు. జోహో ఉత్పత్తుల ఆవిష్కరణలకు మూలధన నిధుల కంటే దీర్ఘకాలిక సహనం అవసరమన్నారు. దేశానికి దీర్ఘకాలిక దృష్టితో పనిచేసే, సహనంతో కూడిన ఆర్‌అండ్‌డీ ఆధారిత సంస్థలు మరిన్ని అవసరమన్నారు.  

ఎంటర్‌ప్రైజ్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ సొల్యూషన్‌ (ఈఆర్‌పీ) ఆవిష్కరణ..  
భారతీయ వ్యాపార కంపెనీల కోసం  దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మేడ్‌ ఇన్‌ ఇండియా ఎంటర్‌ప్రైజ్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) సొల్యూషన్‌ను శ్రీధర్‌ ఆవిష్కరించారు. ప్రస్తుతానికి ఈఆర్‌పీ సొల్యూషన్‌ భారత మార్కెట్‌కే పరిమితమవుతుందని, తరువాత దశలవారీగా ప్రపంచ మార్కెట్లోకి విస్తరించనుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అ య్యేందుకు దాదాపు అయిదేళ్ల సమయం పట్టిందని, భవిష్యత్తులో జోహోకు ప్రధాన వృద్ధి ఇంజిన్‌ గా ఈఆర్‌పీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

Videos

ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది

BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN

2026 పద్మ పురస్కారాలు.. ప్రకటించిన కేంద్రం

ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..

జోగి రమేష్ ను కలిసిన YSRCP నేతలు

ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!

కౌన్ కిస్కా గొట్టం..

పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన

హోటల్ రూమ్ 114.. యువతిని రప్పించి రేప్

కూటమిపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్

Photos

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారశాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)

+5

ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)