జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్
Published on Sat, 01/24/2026 - 20:06
2026 ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అయితే ఈ టైమ్ 1999 నుంచి మారిపోయింది. టైమ్ ఎందుకు మారింది?, దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించడం ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం. ఇండియా టైమ్.. యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT (లండన్‌లోని గ్రీన్‌విచ్ వద్ద ఉన్న ప్రైమ్ మెరిడియన్ ఆధారంగా లెక్కించే ప్రపంచ ప్రామాణిక సమయం) ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.
1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?
భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్‌లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది.
Tags : 1