జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్‌గా ఫీలయ్యా: శివజ్యోతి
Published on Sat, 01/24/2026 - 13:22
బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి త్వరలోనే తల్లి కాబోతోంది. తను గర్భం దాల్చిన దగ్గరి నుంచి రెండు సార్లు సీమంతం చేసుకోవడం వరకు ప్రతి విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. డెలివరీకి దగ్గర్లో ఉన్న ఆమె తన ప్రెగ్నెన్సీపై ఉన్న అనేక అనుమానాలకు, అపోహలకు చెక్ పెడుతూ ఓ వీడియో షేర్ చేసింది.
లేనివారికే తెలుసు ఆ బాధ
అందులో శివజ్యోతి మాట్లాడుతూ.. ముందుగా అందరికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నా.. ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలెప్పుడు? పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడు? ఉద్యోగం లేనివాళ్లను ఏం చేస్తున్నావ్? వంటి ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే అది లేనివారికే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. 2015లో మా పెళ్లి జరిగింది. అంటే పదేళ్లవుతోంది.
దయచేసి అడగకండి
మొదట్లో కెరీర్‌పై ఫోకస్ చేశాం. ఆ సమయంలో పిల్లలెప్పుడు అని అడిగితే నాకు కావాల్సినప్పుడు కంటాను అని ధైర్యంగా ఆన్సరిచ్చేదాన్ని. మూడేళ్లుగా నేను పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలో ఎవరైనా అడిగినప్పుడు మాత్రం చాలా గలీజ్‌గా ఫీలయ్యేదాన్ని. కాబట్టి ఎదుటివాళ్ల పర్సనల్ విషయాలు అడగకండి.

బిగ్‌బాస్ నుంచి రాగానే లాక్‌డౌన్
బిగ్‌బాస్ ముందు వరకు కూడా మా ఇద్దరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. 2019లో నేను బిగ్‌బాస్ నుంచి రాగానే లాక్‌డౌన్ వచ్చింది. దాంతో పిల్లల ఆలోచనను రెండేళ్లు పోస్ట్‌పోన్ చేసుకున్నాం. ఆ తర్వాత మేము ఓ ఇల్లు కొని దాన్ని మాకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుని గృహప్రవేశం చేశాం.. 2023 డిసెంబర్ నుంచి పిల్లలు కావాలనుకున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం.
మొక్కని దేవుడు లేడు
రెండున్నరేళ్లు రకరకాల టెస్టులు చేయించుకున్నాను. చెట్లమందులు ప్రయత్నించాను. మొక్కని దేవుడు లేడు. అయితే నేను ఐయూఐ, ఐవీఎఫ్ ఏది ఎంచుకున్నాను? అని అడుగుతున్నారు. అవేవీ కాదు, వెంకటేశ్వర స్వామి వ్రత ఫలితంతో సహజంగానే గర్భం దాల్చాను. ఒకవేళ ఇది జరగకపోతే ఐయూఐ, ఐవీఎఫ్ చేయించుకునేదాన్ని. అందులో అనుమానమే లేదు అని చెప్పుకొచ్చింది. శివజ్యోతి తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొంది.
చదవండి: బోర్డర్ 2 ఫస్డ్ డే కలెక్షన్స్
Tags : 1