Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..
Breaking News
అక్కినేని అఖిల్ హలో.. జున్ను ఇంతలా మారిపోయిందేంటి?
Published on Fri, 01/23/2026 - 21:43
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన రెండో చిత్రం హలో. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. ఈ చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించింది.
అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన పాప ముద్దుముద్దు మాటలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో జున్ను పాత్రలో అలరించింది. ఈ మూవీ రిలీజై దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ జున్నుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పుడు క్యూట్ క్యూట్‌గా ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో హలో చిన్నారి ఇంతలా మారిపోయిందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అఖిల్ హలో సినిమాలో జున్ను ఎలా మారిపోయిందో చూడండి..#Hellomovie #AkhilAkkineni pic.twitter.com/s86NsIfAt8
— 𝐊𝐢𝐧𝐠𝐕𝐞𝐧𝐤𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐥𝐨𝐫𝐞 (@KingVenkyBAF) January 23, 2026
#Hello Movie ni Endhuku ra Hit Chailedhu 😈💔#HelloMovie 😻🗿 pic.twitter.com/CuA4LcgZSJ
— sId 𝕏 (@IntrovertSidX) October 27, 2024
Tags : 1