Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..
Breaking News
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
Published on Fri, 01/23/2026 - 18:48
అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం రూ. 5400 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2840 వద్దకు వచ్చింది. అంటే దాదాపు సగం తగ్గిందన్నమాట. ఇది పసిడి ప్రియులకు కొంత ఊరటను ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 4950 రూపాయలు పెరిగి.. రూ.1,46,400 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. సాయంత్రానికి 2350 రూపాయలు తగ్గి.. రూ. 1,44,050 వద్దకు చేరింది.
అదే విధంగా 5400 రూపాయలు పెరిగి రూ. 1,59,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి 2560 రూపాయలు తగ్గి రూ. 1,57,150 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎంత వ్యత్యసం ఉందో చూడవచ్చు.
చెన్నైలో కూడా 1,46,500 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. 1,59,820 నుంచి 1,58,730 వద్దకు చేరింది.
ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,46,550 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర.. సాయంత్రానికి 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,59,860 నుంచి రూ. 1,57,150 వద్దకు చేరింది.
వెండి ధరలు
వెండి ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. అయితే కేజీ సిల్వర్ రేటు రూ. 3.60 లక్షలకు చేరింది. గురువారం (జనవరి 22) రూ. 3.40 లక్షల వద్ద ఉన్న వెండి.. ఈ రోజు (శుక్రవారం) రూ. 20వేలు పెరిగింది. దీంతో రేటు రూ. 3.60 లక్షల వద్దకు చేరింది.
Tags : 1