Kadapa : ZPTCల గౌరవ వేతనాలు ఎప్పటి లోగా?
Breaking News
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
పెళ్లిలో చూశాడు.. సినిమాను మించి ట్విస్టులు!
ఆంధ్రా యూనివర్సిటీలో ఆకలి మంటలు..
అబ్బే అదేం లేదు!.. మాట మార్చిన పాక్!
శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం
సిట్ విచారణ.. జూబ్లీహిల్స్ పీఎస్కు హరీష్రావు
రాసలీలల ఎఫెక్ట్.. ఐపీఎస్ రామచంద్ర రావు సస్పెండ్
టెక్కీ మరణం.. సిట్ దర్యాప్తునకు సీఎం యోగి ఆదేశాలు
గ్రీన్ల్యాండ్పైకి అమెరికా యుద్ధ విమానాలు
అమెరికాకు నో కెనడాకే జై
వినుకొండ బస్టాండ్లో తొక్కిసలాట
ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరుతుంది
స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు
అల్లరి నరేశ్ ఇంట విషాదం
Published on Tue, 01/20/2026 - 11:26
టాలీవుడ్ హీరో ‘అల్లరి’ నరేశ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి వెంకటరత్నం 2019లో మరణించారు.

వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో మృతి చెందారు. ప్రముఖ నటులు అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్ ఆయన కుమారులే. వెంకట్రావు మరణంలో అల్లరి నరేశ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.
#
Tags : 1