అది నిజం కాదు.. కానీ నిజం కావాలి : రష్మిక

Published on Tue, 01/20/2026 - 10:53

‘‘నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను’’ అని హీరోయిన్‌  రష్మికా మందన్నా(Rashmika Mandanna ) అంటున్నారు. నటిగా తన కథల ఎంపిక, పారితోషికం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక. ఆమె మాట్లాడుతూ–‘‘హీరోయిన్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా, అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికే ప్రయత్నిస్తుంటాను. కొంతమంది ప్రేక్షకులకు లవ్‌స్టోరీ సినిమాలు ఇష్టం. ఇంకొంతమంది వాణిజ్య చిత్రాలను ఇష్టపడతారు. అందుకే కమర్షియల్, లవ్‌ స్టోరీ, ఉమెన్‌  సెంట్రిక్‌... ఇలా విభిన్న రకాల జానర్స్‌లో సినిమాలు చేస్తున్నాను. 

(చదవండి: నా ఫోటోలు జూమ్‌ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా')

ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌  చేయడం కోసమే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాను. ఇకపై కూడా ఇలానే ముందుకు సాగుతాను. ఇక స్పెషల్‌ సాంగ్స్‌ చేయడంపైనా నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్‌ గా ఉండాలి. లేదంటే.. ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు డైరెక్టర్స్‌ సినిమాల్లో మాత్రం లీడ్‌ రోల్‌ కాకపోయినా స్పెషల్‌ సాంగ్‌ చేస్తాను. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనుకుంటున్నారు.. అయితే ఇది నిజం కాదు. కానీ, అది నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.  

Videos

మద్యం అక్రమ కేసులో మోహిత్ రెడ్డికి భారీ ఊరట

రాధాకృష్ణపై బాబు ప్రేమ రూ.15 కోట్ల విలువైన భూమి

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా 12 మందికి తీవ్ర గాయాలు

బాబుగారి విజన్ బ్లాక్ లిస్ట్ లో ఏపీ!

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Mumbai : అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం

సిట్ విచారణకు హరీష్ రావు!

Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష

Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు

Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..

Photos

+5

'శుభకృత్ నామ సంవత్సర' మూవీ ఈవెంట్‌లో పవిత్ర, నరేష్‌ (ఫోటోలు)

+5

టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

నటుడు నరేష్ బర్త్‌డే స్పెషల్‌.. పవిత్రతో అనుబంధం (ఫోటోలు)

+5

కొమురవెల్లి : అగ్నిగుండంపై ఉత్సవ విగ్రహాలతో పూజారులు (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)