ఇండిగో బాధితులకు రిఫండ్‌ పూర్తి

Published on Fri, 01/16/2026 - 23:47

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. డిసెంబర్ 3-5 మధ్య విమాన రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణికులందరికీ రిఫండ్‌ ప్రాసెస్ చేసిందని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా తెలిపింది.

‘డిసెంబర్ 3-5 వరకు కార్యకలాపాల అంతరాయాల కారణంగా బాధిత ప్రయాణీకులకు అందించే రిఫండ్‌లు, పరిహారాలకు సంబంధించి దేశీయ క్యారియర్ ఇండిగోతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది’ అని డీజీసీఏ పేర్కొంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ఇండిగో విమానాల రద్దుకు సంబంధింంచి అన్ని రిఫండ్లను పూర్తిగా ప్రాసెస్ చేసి, చెల్లింపులు క్లియర్ చేసినట్లు ఇండిగో తెలియజేసిందని వివరించింది.

అంతేకాకుండా ఎక్కువ అసౌకర్యం ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఊరట కల్పించడానికి అదనపు చర్యగా విమానయాన సంస్థ "గెస్చర్‌ ఆఫ్‌ కేర్‌’ పేరుతో ఒక్కొక్కరికీ రెండు రూ.5,000 ట్రావెల్ వోచర్లను అందించినట్లుగా తెలిపింది. వీటికి 12 నెలల చెల్లుబాటు ఉంటుందని, ఆయా తేదీల్లో ఫ్లైట్లు రద్దవడం లేదా మూడు గంటల కంటే ఆలస్యంతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు వీటిని అందించినట్లుగా పేర్కొంది.

బాధిత ప్రయాణికులకు రిఫండ్‌ పూర్తయినట్లు ఇండిగో, డీజీసీఏ చెబుతుంటే మరో వైపు తమకు రిఫండ్‌ అందలేదని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇండిగోను, డీజీసీఏ ట్యాగ్‌ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

#

Tags : 1

Videos

JC నా వెంట్రుకతో సమానం.. పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

బీర్లు తయారుచేసే మైక్రో బ్రువరీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అనసూయకు వేధింపులు.. 42 మందిపై కేసులు

సంక్రాంతి అంటే జూదం, అశ్లీల నృత్యాలుగా మార్చేశారు

ఎవ్వరినీ వదలం.. YS జగన్ వార్నింగ్

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)