Breaking News

గంటలోనే రిప్లై ఇస్తారని ఊహించలేదు!

Published on Fri, 01/16/2026 - 11:52

స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టే ఏ వ్యవస్థాపకుడికైనా నిధుల సేకరణ (Fundraising) అనేది ఒక పెద్ద సవాలు. అటువంటి తరుణంలో దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల సీఈఓల నుంచి స్పందన లభిస్తే ఆ ఉత్సాహమే వేరు. సరిగ్గా ఇలాంటి అనుభవమే సింగపూర్‌కు చెందిన భారతీయ పారిశ్రామికవేత్త మనోజ్ అహిర్వార్‌కు ఎదురైంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్‌కు ఆయన పంపిన ఒక ఈమెయిల్ తన జీవితాన్నే మార్చేసినట్లు ఇటీవల గుర్తుచేసుకున్నారు.

ఆ ఒక్క ఈమెయిల్ ఇచ్చిన ధైర్యం

2022లో మనోజ్ అహిర్వార్ తన స్టార్టప్ ఆలోచనను వివరిస్తూ నితిన్ కామత్‌కు మెయిల్ పంపారు. సాధారణంగా బిజీగా ఉండే దిగ్గజ సీఈఓల నుంచి స్పందన రావడం కష్టమని భావించిన అహిర్వార్‌కు కేవలం ఒక్క గంటలోనే కామత్‌ నుంచి రిప్లై రావడంతో ఆశ్చర్యపోయారు. అయితే ఆ వ్యవహారం పెట్టుబడికి సంబంధించింది కాకపోయినప్పటికీ, నితిన్ చూపిన చొరవ అహిర్వార్‌పై ఎంతో ప్రోత్సాహంగా మారింది.

ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘నేను 2020లో నా స్టార్టప్ కంపెనీ మనీఫిట్‌ను ప్రారంభించినప్పుడు నితిన్ కామత్‌ను సంప్రదించాను. సమాధానం వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఆయన గంటలోపే స్పందించారు. అప్పట్లో నాకు పెట్టుబడి సమకూరలేదు. అయితే ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు ఇంత సులభంగా అందుబాటులో ఉండటం నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’ అని అహిర్వార్ పేర్కొన్నారు.

రూ.1.8 కోట్ల ఆదాయం వైపు..

మనోజ్ అహిర్వార్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి బీటెక్‌ పూర్తి చేసిన ఆయన అంతకుముందు రెండు స్టార్టప్‌లను ప్రారంభించి మూసివేశారు. 2022 బెంగళూరులో ‘మనీఫిట్’ను ప్రారంభించారు. కానీ అది కూడా అదే ఏడాది నిలిచిపోయింది. ప్రస్తుతం తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త వెంచర్‌తో దూసుకుపోతున్నారు. ఓ స్టార్టప్‌ కంపెనీని స్థాపింది సుమారు 2,00,000 డాలర్లు (సుమారు రూ.1.8 కోట్లు) వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ‘జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో నా స్టార్టప్ కంపెనీ పెట్టుబడికి సిద్ధంగా లేదని అర్థమైంది. కానీ ప్రయత్నించినందుకు సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు.

సోషల్‌ మీడియాలో రిప్లై

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు అహిర్వార్ పట్టుదలను, నితిన్ కామత్ చొరవను ప్రశంసిస్తున్నారు. ‘నితిన్ కామత్ వంటి సీఈఓలు సులభంగా అందుబాటులో ఉండటం స్టార్టప్ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది’ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ‘చాలా మంది విఫలమైతే వదిలేస్తారు, కానీ మీరు పట్టుదలతో కొనసాగడం స్ఫూర్తిదాయకం’ అని మరొకరు అభినందించారు.

ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

Videos

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Peddareddy : ఎక్కడికి రమ్మంటావ్..ప్లేస్ చెప్పు నేనేంటో చూపిస్తా

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)