Breaking News

మ్యూజిక్ డైరెక్టర్‌ టూ హీరో.. సక్సెస్ అయింది వీళ్లే..!

Published on Fri, 01/16/2026 - 11:08

ఒక సినిమా హిట్‌ కావాలంటే కథతో పాటు బీజీఎం, నేపథ్య సంగీతం చాలా కీలకం. కథను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చడంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర తప్పనిసరి. అందుకే స్టార్‌ హీరోల చిత్రాలకు సంగీత దర్శకుడు ఎవరనే దానిపై ఆడియన్స్‌లో ఆసక్తి ఉంటుంది. అలా టాలీవుడ్‌లో ఎస్ఎస్ తమన్, భీమ్స్ సిసిరోలియో, దేవీశ్రీ ప్రసాద్‌, అనూర్ రూబెన్స్, మిక్కీ జే మేయర్ లాంటి వాళ్లు ఉన్నారు. వీరి టాలెంట్‌పైనే సినిమా రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది.

అలా తమ మ్యూజిక్‌ టాలెంట్‌తో అలరించిన సంగీత దర్శకులు ఆ తర్వాత హీరోలుగా కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా మన టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇస్తున్నారు. బలగం మూవీతో హిట్ కొట్టిన వేణు యెల్దండి డైరెక్షన్‌లో వస్తోన్న ఎల్లమ్మతో అరంగేట్రం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్‌ టూ హీరోగా ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరైనా ఆరా తీస్కే ఒకట్రెండు ప్రముఖుల పేర్లు మాత్రమే వినిపించాయి. అలా ఎంట్రీ ఇచ్చినవారిలో కోలీవుడ్ నుంచి విజయ్ ఆంటోనీ, జీవీ ప్రకాశ్ కుమార్ ఉన్నారు. వీరిద్దరు మాత్రమే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోలుగా పలు సినిమాలు చేశారు. అయితే బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ మాత్రం కొట్టకపోయినా.. ఓ మాదిరి చిత్రాలైతే చేశారు. ఒకరకంగా చూస్తే వీరిద్దరు హీరోలుగా అంతగా సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. విజయ్ ఆంటోనీ మాత్రం సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకని.. ఆ తరువాత నటుడిగా, నిర్మాతగా రాణించారు.

ఇప్పుడు టాలీవుడ్‌ నుంచి దేవీశ్రీ ప్రసాద్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా బలగంతో హిట్‌ కొట్టిన వేణు యెల్దండి.. రెండో సినిమా కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి మొదటి సినిమాతోనే దేవీశ్రీ ప్రసాద్ హిట్ కొడతాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అంతేకాకుండా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్ రవిచందర్ కూడా హీరోగా మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 
 

Videos

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Peddareddy : ఎక్కడికి రమ్మంటావ్..ప్లేస్ చెప్పు నేనేంటో చూపిస్తా

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)