మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
Breaking News
శ్రియా శరణ్ లేటేస్ట్ వెబ్ సిరీస్.. స్పేస్ జెన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Published on Fri, 01/16/2026 - 08:39
సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ స్పేస్ జెన్..చంద్రయాన్. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇస్రో ప్రయోగాల వెనుక ఉన్న కృషిని, శాస్త్రవేత్తల పట్టుదలను ఇందులో చూపించనున్నారు. చంద్రయాన్ మిషన్ సక్సెస్‌ఫుల్ జర్నీని వెబ్ సిరీస్ రూపంలో కళ్లకు కట్టేలా చూపించనున్నారు.
ఈ సిరీస్‌కు అరునాబ్ కుమార్ దర్శకత్వం వహించారు. పంచాయత్, కోటా ఫ్యాక్టరీ వంటి సూపర్ హిట్ సిరీస్‌లను అందించిన టీవీఎఫ్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ జనవరి 23 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1.. ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2, 2023లో చంద్రయాన్-3తో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో ప్రయాణం ఇందులో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Chandrayaan-3 mission ki safalta dekhi? Ab dekho uske peeche ki kahaani🇮🇳#SpaceGen - Chandrayaan, trailer out now!
Hotstar Specials: Space Gen – Chandrayaan, all episodes streaming Jan 23 on JioHotstar.@TheViralFever @ArunabhKumar @TheBhaatu @DhaakadChhora @Shewbham… pic.twitter.com/T6GqCZe225— JioHotstar (@JioHotstar) January 13, 2026
Tags : 1