మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
Breaking News
మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
Published on Fri, 01/16/2026 - 07:31
మలయాళంలో తెరకెక్కించిన యాక్షన్ సినిమా చతా పచ్చ.. ది రింగ్ ఆఫ్ రౌడీస్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, ఇషాన్ షౌకత్ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 22న థియేటర్లో సందడి చేయనుంది.
ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తేనే రెజ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమ్ రెజ్లింగ్ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్‌లో రెజ్లింగ్, కుస్తీ ఫైటింగ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
Tags : 1