ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం
Breaking News
జపాన్‌లోనూ తగ్గేదేలే.. పుష్ప-2 డైలాగ్స్‌తో మార్మోగిన థియేటర్
Published on Thu, 01/15/2026 - 19:39
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ మూవీని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 16న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఒక రోజు ముందే జపాన్‌లో పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ షోకు అల్లు అర్జున్, రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు. జపాన్ అభిమానుల ముందు బన్నీ డైలాగ్స్ చెప్పి జోష్ పెంచారు. జపాన్ భాషలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడంతో థియేటర్ ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
The Whistles & Vibe
At the #PushpaKunrin premiere...❤️🔥#Pushpa2TheRule Icon Star @alluarjun @IamRashmika pic.twitter.com/p9qiVwkG8I— Bunny Vas (@TheBunnyVas) January 15, 2026
Tags : 1