గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
Breaking News
సూపర్ హిట్ సిరీస్ మూవీ.. దృశ్యం-3 రిలీజ్ ఎప్పుడంటే?
Published on Wed, 01/14/2026 - 18:17
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన దృశ్యం సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రెండు పార్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాలను తెలుగు, హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో వెంకటేశ్, హిందీ అజయ్ దేవగణ్ ఈ చిత్రాల్లో నటించారు.
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తోన్న దృశ్యం-3 రిలీజ్ తేదీని ప్రకటించారు. ఓ వీడియోను షేర్ చేసిన మోహన్‌లాల్.. ఏప్రిల్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ఈ సమ్మర్‌లో సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కాగా.. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించారు. ఈ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని గతంలో దర్శకుడు జీతూ జోసెఫ్ చెప్పారు.
Years passed. The past didn’t.#Drishyam3 | Worldwide Release | April 2, 2026
@jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk #MeenaSagar
@aashirvadcine@PanoramaMovies @PenMovies @ram_rampagepix @Rajeshmenon1969 @Abh1navMehrotra
@drishyam3movie pic.twitter.com/uqEaPvqMyv— Mohanlal (@Mohanlal) January 14, 2026
Tags : 1