గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
Breaking News
మెగా ఫ్యామిలీ ఇంట భోగి.. చరణ్ ఏం చేశాడంటే?
Published on Wed, 01/14/2026 - 15:32
కుటుంబమంతా ఒకచోట చేరితేనే అసలు సిసలైన పండగ. ఈ విషయం మెగా ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే అంతా కలిసి భోగి పండగను ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దోశలు వేసిన మెగా ఫ్యామిలీ
అందులో వైష్ణవ్ తేజ్, వరుణ్- లావణ్య, రామ్‌చరణ్, సుస్మిత దోశలు వేస్తున్నారు. సాయిదుర్గతేజ్ టీ/కాఫీ తాగుతుంటే రామ్‌చరణ్ అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయాడు. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సూపర్ హిట్ అవడంతో మరింత జోష్‌తో పండగ జరుపుకున్నారు.
భోగిలా లేదు
ఇది భోగిలా లేదు, దోశ రోజుగా ఉంది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే.. మా కుటుంబమంతా ఒక చోట చేరి మన సాంప్రదాయాలను, పండగలను అద్భుతంగా జరుపుకుంటాం అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతంలో కూడా భోగి సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఇలా ఒకే చోట చేరింది. చిరంజీవికూడా స్వయంగా దోశలు వేసి వడ్డించేవాడు.
సినిమా
చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "మన శంకరవరప్రసాద్‌గారు". అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా దూసుకెళ్తోంది. దీంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది.
చదవండి: బోరుమని ఏడ్చిన అనసూయ.. అందుకే కన్నీళ్లాగలేదు
Tags : 1