Breaking News

క్రైమ్‌ యాంకర్‌గా శోభిత.. చీకటిలో ట్రైలర్‌ చూశారా?

Published on Mon, 01/12/2026 - 13:41

అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజవుతోంది. సోమవారం (జనవరి 12న) ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో శోభిత క్రైమ్‌ యాంకర్‌ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్‌గా పనిచేసినా.. తర్వాత జాబ్‌ నచ్చలేదని మానేసి పాడ్‌కాస్ట్‌ ప్రారంభించింది. ఆ పాడ్‌కాస్ట్‌కు చీకటిలో అన్న టైటిల్‌ ఖరారు చేసింది.

క్రైమ్‌ యాంకర్‌గా శోభిత
సమాజంలో జరుగుతున్న నేరాల గురించి అందులో మాట్లాడింది. ఎంత పెద్ద క్రిమినల్‌ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ గురించి ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టింది. దీంతో సదరు సీరియల్‌ కిల్లర్‌.. చిమ్మ చీకటిలో ఇంకో ప్రాణం గాల్లో కలిసిపోతుందని ముందుగానే వార్నింగ్‌ ఇస్తాడు. మరి అతడిని హీరోయిన్‌ పట్టుకుంటుందా? అదే సమయంలో అతడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటుందా? అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

సినిమా
చీకటిలో మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్‌ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది.

 

చదవండి: పీరియడ్స్‌.. నీళ్లలో తడిచా.. బట్టలు మార్చుకుంటానంటే..: హీరోయిన్‌

Videos

Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..

Revanth Reddy: రోడ్డు మీదకొచ్చే ముందు.. యాక్సిడెంట్స్ మర్డర్స్ తో సమానం

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పై అంబటి రియాక్షన్

ABN ఆఫీస్ ఏదురుగానే ABN పత్రికను కాల్చేసిన YSRCP నేతలు

ఈ సంక్రాంతికి డాన్స్ వేస్తారా? రిపోర్టర్ ప్రశ్నకు అంబటి సెటైర్లు

Rayana Bhagya: ఏ ఇంట్లో సంక్రాంతి లేదు పేదలకు పండగ లేకుండా చేశావ్

మన శంకర వరప్రసాద్ గారు హిట్టా.. ఫట్టా

అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా

ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు

Uttam Kumar: పోలవరంపై సంచలన కామెంట్స్..సుప్రీంలో తెలంగాణ దావా!

Photos

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)