Breaking News

రూ.2.7 కోట్ల జీతం.. జాబ్‌ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..

Published on Mon, 01/12/2026 - 13:31

ప్రస్తుతం ఉన్న జాబ్‌ మార్కెట్‌లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే? సరిగ్గా ఇదే ఆలోచనతో, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్లూలీ (Kluly) అనే ఏఐ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) డేనియల్ మిన్ తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడాదికి ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2.7 కోట్లు) వేతనం ఉన్న కొలువును వదులుకుని ఆయన కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.

చిన్న వయస్సులోనే..

ప్రఖ్యాత వార్టన్ స్కూల్ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన డేనియల్ మిన్ మే 2025లో తన 21వ ఏటనే క్లూలీలో చేరారు. మిన్ తన ప్రతిభతో తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ విజయం వెనుక ఉన్న శ్రమ క్రమంగా అతని మానసిక స్థితిపై ప్రభావం చూపడం మొదలైందని తాను చెప్పారు.

రాజీనామా అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ మిన్ తన మనసులో మాటను పంచుకున్నారు. ‘కెరీర్ ప్రారంభంలో రోజుకు 12 గంటలు కష్టపడటం సహజమని నేను భావించాను. కానీ, కాలక్రమేణా ఆ ‘గ్రైండ్’(నిరంతర పని) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నా స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం లేదా నా సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన పని, క్రమేణా భారంగా మారిందని, పని కాకుండా అసలు వేరే జీవితమే లేకుండా పోయిందని వెల్లడించారు.

సీఈఓ ముందే..

కంపెనీ సీఈఓ రాయ్ లీ తన పనితీరును గమనించి రాజీనామా గురించి అడిగినప్పుడు డేనియల్ మిన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. తన రాజీనామా నిర్ణయాన్ని చెబుతూ ఆయన సీఈఓ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, రాయ్ లీ ఎంతో సానుభూతితో స్పందించారని, ఉద్యోగం కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని తనను ప్రోత్సహించారని మిన్ తెలిపారు. ‘తమ ఉద్యోగుల శ్రేయస్సును కోరుకునే ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం’ అన్నారు.

సోషల్ మీడియా స్పందన

డబ్బు కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావించి డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘గ్రైండ్ కల్చర్ పేరుతో యువతను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదు’ అని కొందరు కామెంట్‌ చేశారు. ‘మీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ కొందరు కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి, కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీని వదులుకుని డేనియల్ మిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం

Videos

Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..

Revanth Reddy: రోడ్డు మీదకొచ్చే ముందు.. యాక్సిడెంట్స్ మర్డర్స్ తో సమానం

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పై అంబటి రియాక్షన్

ABN ఆఫీస్ ఏదురుగానే ABN పత్రికను కాల్చేసిన YSRCP నేతలు

ఈ సంక్రాంతికి డాన్స్ వేస్తారా? రిపోర్టర్ ప్రశ్నకు అంబటి సెటైర్లు

Rayana Bhagya: ఏ ఇంట్లో సంక్రాంతి లేదు పేదలకు పండగ లేకుండా చేశావ్

మన శంకర వరప్రసాద్ గారు హిట్టా.. ఫట్టా

అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా

ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు

Uttam Kumar: పోలవరంపై సంచలన కామెంట్స్..సుప్రీంలో తెలంగాణ దావా!

Photos

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)