Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..
Breaking News
ఆకాశమంతా సంక్రాంతి
Published on Mon, 01/12/2026 - 12:28
తెలుగు వారు ఏడాది మొత్తం వేచి చూసే పండగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండగ వస్తోంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అతివలు ముంగిట్లో అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఇష్టపడుతుంటారు.
ఈ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం అనేది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం అయిన విషయం కాదు. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో గాలిపటం ఎగురేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్‌లో ఉత్తరాయణ సమయంలో ఆకాశంలో రంగు రంగుల గాలిపటాలు సందడి చేస్తాయి.
⇒ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎలా మేడలపై, మైదానంలో,పోలాల్లోంచి పతంగులు ఎగుర వేస్తారు. మహారాష్ట్ర ప్రజలు కూడా సముద్ర తీరాల్లో ఎగిసే కెరటాల మధ్య గాలిపటాల ΄ోటీలు పెట్టుకుంటారు.
⇒ రాజస్థాన్ ఓల్డ్ సిటీలో ఉన్న మేడలపై యువతీ యువకులు అక్కడి ఘేవర్ పేనీలు, నువ్వుల లడ్డూలను ఆస్వాదిస్తూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు.
⇒ ఉత్తర ప్రదేశ్‌లో ప్రతీ గల్లీలో పతంగుల పోటీ జరుగుతుంది.
⇒ కలకత్తాలో గ్రూపులుగా ఏర్పడి గాలిపటాలు ఎగరేయడానికి ఇష్టపడగా, కర్ణాటక, తమిళనాడులో బీచుల్లో గాలిపటాలను ఎగరేయడానికి ఇష్టపడతారు.
అన్ని రాష్ట్రాల్లో పండగ స్పూర్తి గాలిపటాలు ఎగరవేయడంలోనే కనిపిస్తోంది. ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనే ఆశయానికి సంక్రాంతి ఒక వేదికగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ఆకాశం సాక్షిగా చాటే మార్గంగా గాలిపటం నిలుస్తోంది.
Tags : 1