Breaking News

తిరుమల మెట్లు ఎక్కలేని పవన్‌కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'.. అసలు కథ ఇదే

Published on Mon, 01/12/2026 - 11:37

ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీని గురించి పూర్తిగా వివరాలు తెలియకపోవడంతో చివరకు పవన్‌ ఫ్యాన్స్‌ కూడా ఓవర్‌ థింకింగ్‌ చేస్తున్నారు. వాళ్లకు విషయం తెలియకపోవడంతో 'పవన్‌ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్' అంటూ పుష్ప డైలాగ్స్‌ కొడుతున్నారు. కొందరైతే ఇదీ అరుదైన ఘనత.. అంతర్జాతీయ గౌరవం అంటూ పవన్‌ ఫొటోలతో షేర్‌ చేస్తున్నారు. వాస్తవం తెలిసిన వారు మాత్రం నోరెళ్లబెడుతున్నారు.  

హైదరాబాద్ పాతబస్తీలోని ఆగాపురాలో ఉండే 'గోల్డెన్ డ్రాగన్స్' కరాటే ట్రైనింగ్ సంస్థ నుంచి పవన్ కల్యాణ్‌కు "టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే బిరుదును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో సుమారు నలభై ఏళ్లకు పైగా డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీ వేల మందికి కరాటేలో కోచింగ్ ఇచ్చారు. ఆయన చేతుల మీదుగానే పవన్‌కు ఈ గౌరవం దక్కింది. అందరూ అనుకున్నట్లు జపాన్‌లోని ఏ మార్షల్‌ ఆర్ట్స్‌ సంస్థ పవన్‌కు ఈ బిరుదు ఇవ్వలేదు.

పవన్‌కు 'ఫిఫ్త్‌ డాన్‌' పురస్కారం కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ మొహమూదీనే ఇచ్చారు. జపాన్‌లో సంప్రదాయ యుద్ధకళలకు శిక్షణ ఇచ్చే సంస్థల్లో ఒకటైన ‘సాగో బుడో కన్‌’ నుంచి బ్లాక్‌బెల్ట్‌లో ఫిఫ్త్‌ డాన్‌ పురస్కారం ఇస్తున్నట్లు ఒక పత్రాన్ని పవన్‌ చేతికి ఇచ్చాడు. అయితే, ఇక్కడ ఫైనల్‌గా ఇంకో విషయం ఉంది. ప్రాచీన జపనీస్‌ కత్తిసాము కళ (కెంజుట్సు)లో పవన్‌కు ఎంట్రీ దొరికింది అని చెప్పారు. బహుషా కత్తిసాము నేర్చుకునేందుకు ఆయన జపాన్‌ వెళ్తారేమో చూడాల్సి ఉంది.

మార్షల్ ఆర్ట్స్‌తో పాటు 'చేతబడి' కూడా..
పవన్‌ కల్యాణ్‌కు అవార్డ్‌ ప్రదానం చేసిన డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉంది. నాలుగు దశబ్దాలుగా ఆయన చాలామందికి శిక్షణ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌, ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, చిరోప్రాక్టర్, మాగ్నెటో థెరపీ, అరోమా థెరపీలలో నైపుణ్యంతో పాటుగా 'చేతబడి, మంత్రాలకు విరుగుడు' చేయడంలో కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిఖ్ ఎంతో సిద్ధహస్తుడని ఆయన ప్రొఫైల్‌లో పేర్కొనడం విశేషం. ఆయన చేతుల మీదుగా పవన్ కల్యాణ్‌కు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడంతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

కెంజుట్సు అంటే ఏమిటి? పవన్‌కు సాధ్యమేనా?
ఇది జపాన్‌లోని సమురాయ్ యోధులు యుద్ధంలో ఉపయోగించే ఖడ్గ యుద్ధకళ. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలో ఇందులో నేర్పిస్తారు. కత్తితో ప్రత్యక్ష యుద్ధరంగంలోకి దిగితే ఎలాంటి కదలికలు ఉండాలో చూపుతారు. గురువు పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమయ్యే అత్యంత కఠిణమైన శిక్షణగా జపాన్‌ యోధులు తెలుపుతారు.  ఇందులో రాణించాలంటే  శరీర శక్తి మాత్రమే కాకుండా మనసు స్థిరత్వం, క్రమశిక్షణ అతి ముఖ్యమైనవి. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ఉన్న పరిస్థితిల్లో జపాన్‌ వెళ్లి కెంజుట్సు నేర్చుకునేందుకు సాధ్యమయ్యే పనేనా అని సందేహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తిరుమల మెట్లు ఎక్కలేని పవన్‌కు సాధ్యమయ్యేనా..?
సుమారు ఏడాది క్రితం ప్రాయశ్చిత దీక్ష పేరుతో పవన్ కల్యాణ్ తిరుమల బయలుదేరారు. ఆ సమయంలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. అయితే, ఆ మెట్లు ఎక్కేందుకు పవన్‌ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో పలుమార్లు ఆగుతూ.. ఆపసోపాలు పడుతూ మెట్లు ఎక్కారు. ఈ క్రమంలో మోకాళ్ల నొప్పి రావడంతో స్విమ్స్‌కు చెందిన ఫిజియోథెరఫిస్ట్ రావాల్సి వచ్చింది. ఆపై హరిహర వీరమల్లు సినిమాలో​ పవన్‌ కంటే డూప్‌ ఎక్కువ భాగం కనిపించారు. గ్రాఫిక్స్‌తోనే పని పూర్తిచేశారు. ఇంత హిస్టరీ ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు కెంజుట్సు(ఖడ్గ యుద్ధకళ)  నేర్చుకునే చాన్స్‌ ఉందా..? అంటే సందేహమే..!

పవన్‌ కల్యాణ్‌ సినీ రంగంలోకి రాకముందు చెన్నైలో కరాటేలో శిక్షణ పొందారు. ఆయన గురువు 'షిహాన్ హుస్సేని' చివరి రోజుల్లో బ్లడ్‌ క్యాన్సర్‌తో.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని మరణించారు. సాయం చేయాలని బహిరంగంగానే పవన్‌ను కోరారు. కానీ, ఆయన కష్టాల కేకలు పవన్‌ వరకు వినిపించలేదేమో.. చివరకు అనారోగ్యంతో ఆయన గత ఏడాది మరణించారు. కరాటే అంటే ఆయనకు చాలా ఇష్టం కావడంతో జానీ, తమ్ముడు, ఖుషి, ఓజీ వంటి సినిమాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత చూపించారు.

Videos

Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..

Revanth Reddy: రోడ్డు మీదకొచ్చే ముందు.. యాక్సిడెంట్స్ మర్డర్స్ తో సమానం

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పై అంబటి రియాక్షన్

ABN ఆఫీస్ ఏదురుగానే ABN పత్రికను కాల్చేసిన YSRCP నేతలు

ఈ సంక్రాంతికి డాన్స్ వేస్తారా? రిపోర్టర్ ప్రశ్నకు అంబటి సెటైర్లు

Rayana Bhagya: ఏ ఇంట్లో సంక్రాంతి లేదు పేదలకు పండగ లేకుండా చేశావ్

మన శంకర వరప్రసాద్ గారు హిట్టా.. ఫట్టా

అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా

ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు

Uttam Kumar: పోలవరంపై సంచలన కామెంట్స్..సుప్రీంలో తెలంగాణ దావా!

Photos

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)