ఏజెంట్ మూవీ నాకు చాలా స్పెషల్
Breaking News
'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్
Published on Sat, 01/10/2026 - 20:18
సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నట్లు నిర్మాతలు తరచూ అంటుంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాలో ఒకే సమయంలో విడుదలైనప్పుడు వారి అభిమానులు ఇలాంటి ఫేక్ రివ్యూలతో రంగంలోకి దిగుతారు. దీంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇప్పుడు అలాంటి ఫేక్ రివ్యూలకు కోర్టు ఆర్డర్‌తో చెక్ పడింది. ఈ ట్రెండ్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతోనే ప్రారంభం అవుతుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు సంబంధించి ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌లలో రేటింగ్‌లు , రివ్యూలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 'బుక్ మై షో' తమ పోర్టల్‌లో పేర్కొంది. సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు కొందరు బాట్‌లను ఉపయోగించి నకిలీ రేటింగ్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు. దీనిని కట్టడి చేసేందుకు 'BlockBIGG' & 'Aiplex' సంస్థలు రంగంలోకి దిగాయి. ఇక నుంచి బాట్స్ ఉపయోగించి ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎవరూ ఫేక్ రివ్యూలు ఇవ్వడం కుదరదు. అలా ఎవరైన ప్రయత్నం చేసినా నేరం అవుతుందని పేర్కొంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఇది సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సినిమాలపై కుట్రపూరితంగా జరిగే నెగెటివ్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలకు ఇక నుంచి చెక్ పడనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీకి ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూలు, రేటింగ్స్ చట్టబద్ధంగా నిలిపివేయబడ్డాయి.
Tags : 1