Breaking News

శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్‌లు..!

Published on Fri, 01/09/2026 - 10:41

శీతాకాలంలో చాలామంది చర్మం పొడిబారి నిగారింపు లేకుండా ఉంటుంది. ఎంత తెల్లటి ముఖమైన చలిగాలికి పెళుసుగా జీవం లేనట్టుగా అయిపోతుంది. ఆయిల్‌ స్కిన్‌ వాళ్ల ముఖం సైతం కళాహీనంగా ఉంటుంది. అందుకోసం ముఖానికి పూసే మాయిశ్చర్‌లు, క్రీమ్‌ వంటింటి చిట్కాలే ఉయోగిస్తే సరిపోదు. ఈ వణికించే చలిలో చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఈ ఆరు సూప్‌లను మన డైట్‌లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వీటితో అందం, ఆరోగ్యం రెండిటిని సొంతం చేసుకోవచ్చు. చర్మం మెరిసేలా పోషకాలందించే ఆరోగ్యకరమైన ఆ సూప్‌లు ఏంటో సవివరంగా చూద్ధామా..!.

హైడ్రేషన్‌ని తోడ్పడేలా చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేసే ఈ సూప్‌లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చట. మాయిశ్చరైజర్లు, సీరమ్‌లు వంటివి బాహ్యంగా చర్మానికి మద్దతు ఇ‍వ్వగా అంతరంగంగా హెల్ప్‌ అయ్యే ఆ సూప్‌లు ఏంటంటే..

క్యారెట్, అల్లం సూప్‌లు: క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ తోపాటు, విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం మరమత్తుకు, హైడ్రేషన్‌కీ కీలకమైనది. అల్లం యాంటిబయోటిక్‌ల పనిచేసి..ఎలాంటి ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా చూస్తంఉది. ఈ వింటర్‌ సీజన్‌లో ఆరోగ్యానికి శక్తిమంతమైన సూప్‌గా చెప్పుకోవచ్చు.

టమోటా తులసి సూప్: టమోటాలలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్‌లు  చర్మం పాడవ్వకుండా కాపాడుతుంది, మృదువుగా ఉంచుతుంది. తులసిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రిఫ్రెషింగ్ ట్విస్ట్‌ను అందిస్తుంది. ఇది రుచిగా ఉండటమే గాక చర్మానికి సహజ మెరుపుని అందిస్తుంది కూడా.

పాలకూర, కాయధాన్యాల సూప్: పాలకూరలో ఉండే ఐరన్‌, ఫోలేట్‌, విటమిన్‌ సీ, కొల్లాజెన్‌ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఇక కాయధాన్యాలలోని ప్రోటీన్‌ చర్మ మరమత్తుకు హెల్ఫ​ అవుతుంది. పైగా చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.

గుమ్మడికాయ సూప్: గుమ్మడికాయలో విటమిన్లు ఏ,సీలు ఉంటాయి. ఇవి తేమను పునురుద్ధరించి చర్మం పొడిబారకుండా చూస్తుంది.దీని క్రీమీ టెక్స్చర్ చర్మ ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. దీనిలోని గుమ్మడి గింజలను కూడా డైట్‌లో చేర్చుకుంటే..చర్మానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.

చికెన్ అండ్‌ వెజిటబుల్ సూప్: చర్మాన్ని ఆరోగ్యవంతంగా, తాజాగా ఉండేలా చేస్తుంది. అంతర్లీనంగా మంఇచ ఓదార్పుని, మృదుత్వాన్ని అందిస్తుంది.

చిలగడదుంప, కొబ్బరి సూప్‌: చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి పాలు తేమను నిలుపుకునే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా చూస్తుంది. 

ఈ సూప్‌లు అంతర్లీనంగా చర్మ ఆరోగ్యాన్ని రిపేర్‌ చేసి అందంగా ఉండేలా చేయడమే కాకుండా ఆరోగ్యపరంగాను ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్‌లు.

 

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)