రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
Breaking News
త్వరలో గుడ్‌న్యూస్ చెప్తానంటున్న హీరోయిన్
Published on Fri, 01/09/2026 - 09:34
హీరోయిన్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ గతేడాది పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు మిలింద్ చంద్వానీని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకుంది. తాజాగా ఈ జంట ఓ వ్లాగ్‌లో త్వరలోనే ఒక కొత్త ప్రయాణం మొదలు కానుందని ప్రకటించింది. దీంతో అవికా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం ఊపందుకుంది.
ఈ రూమర్స్‌ను తాజాగా అవికా గోర్ కట్టిపారేసింది. నేను గర్భవతిని కాదు, అలాంటి విశేషం ఏం లేదు. కాపోతే త్వరలోనే ఓ శుభవార్త చెప్తాను, అదేంటో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే! అని చెప్పింది.
ప్రేమ- పెళ్లి
అవికా- మిలింద్ 2020లో హైదరాబాద్‌లో తొలిసారి కలుసుకున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ స్నేహం ప్రేమగా మారింది. 2025 జూన్‌లో ఈ లవ్‌బర్డ్స్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది 'పతీ పత్నీ ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నారు.
సినిమా
అవికా విషయానికి వస్తే.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్‌గా మారింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, 10th క్లాస్ డైరీస్, షణ్ముఖ వంటి పలు తెలుగు సినిమాలు చేసింది.
చదవండి: రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!
Tags : 1