విజయవాడ సెంటర్‌లో 'కృష్ణ' విగ్రహావిష్కరణ

Published on Thu, 01/08/2026 - 19:40

సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడతో ఘట్టమనేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కడ అయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. జనవరి 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు  కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ మనవుడు  'జై కృష్ణ' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

అగ్ని పర్వతం సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆదిశేషగిరిరావు తెలిపారు.  ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారని చెప్పారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే31వ తేదీన సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మహేష్ బాబు,  కృష్ణ లాగా తను కూడా అభిమానులను సంపాదించుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ సినిమా థియేటర్స్‌ యజమానులతో పాటు నగర ప్రజలతో కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు.

సినిమా టికెట్‌ ధరలపై సూచన
టాలీవుడ్‌లో సినిమా టికెట్‌ ధరల పెంపు అనేది ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈ అంశంపై తాజాగా  ఆదిశేషగిరిరావు స్పందించారు.  నిర్మాతలతో పాటు ప్రేక్షకుల కోణంలో ఆయన మాట్లాడారు. ఒక సినిమాకు బడ్జెట్‌ పెరిగిందనే సాకు చూపించి టికెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్‌ పద్ధతి కాదని అయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకు టికెట్‌ ధరలు పెంచడంతో చిన్న సినిమాలు భారీగా దెబ్బతింటున్నాయన్నారు. ఆపై టికెట్‌ ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెద్ద సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్‌ భారీ ధరలు ఉంటాయని, ఆ మూడు రోజుల  అయిపోగానే ఎటూ రేట్లు తగ్గుతాయన్నారు. టికెట్‌  ధరలు  అందుబాటులోకి థియేటర్‌కు వెళ్లాలని ప్రేక్షకులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని ఆదిశేషగిరిరావు తెలిపారు.

Videos

KSR Show: జగన్‌పై పిచ్చి రాతలు ఎల్లో మీడియాకు ఇచ్చిపడేసిన తోపుదుర్తి

చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మచిలీపట్నంలో YSRCP కొత్త ఆఫీస్

Sailajanath : క్యాపిటల్‌కి డెఫినిషన్ కూడా తెలియదు.. ఎలా సీఎం అయ్యావ్ చంద్రబాబు

తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి

Vellampalli Srinivas: పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం... కొంచమైనా సిగ్గుందా చంద్రబాబు

చంద్రబాబుపై కొండా రాజీవ్ ఫైర్

జననాయగన్ మధ్యాహ్నం రిలీజ్! మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

తెగిన బోగీల లింక్.. 2 కిలోమీటర్లు అట్లనే..!

Watch Live: విజయవాడలో నిరసన దీక్ష

Photos

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)

+5

చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)