Breaking News

జన నాయగన్ 'బుక్‌ మై షో' రీఫండ్‌.. చరిత్రలో ఇదే తొలిసారి

Published on Thu, 01/08/2026 - 16:12

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌  ప్రకటించింది. అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు విజయ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇప్పటికే 'బుక్‌ మై షో'(BookMyShow)  ద్వారా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్‌లో అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా 'జన నాయగన్‌'(Jana Nayagan) రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

బుక్‌ మై షోలో రికార్డ్‌
'జన నాయగన్‌' వాయిదా పడటంతో  ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి 'బుక్‌మైషో' రీఫండ్‌ చేస్తుంది. టికెట్‌కు సంబంధించిన డబ్బులను ఎలా రీఫండ్‌ చేసుకోవాలో కూడా మెయిల్‌ ద్వారా పంపింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో జన నాయగన్ కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్‌ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్‌కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 

విజయ్‌ కోసం 'కమల్‌హాసన్‌' మేనల్లుడు
జన నాయగన్‌ సెన్సార్‌ విషయంలో కమిటీలోని నలుగురు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ, కమిటీలోని ఒక సభ్యుడు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు  CBFC ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో    సెన్సార్‌ సర్టిఫికెట్ జారీ ఆగిపోయింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను నిలిపివేయాలన్న సిబిఎఫ్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ సినిమా తరుఫున కమల్‌హాసన్‌ మేనల్లుడు సతీశ్‌ పరాశరణ్‌ వాదిస్తున్నారు.

Videos

Bapatla: కళ్లకు గంతలు కట్టి.. యువతిని చావబాదిన సీఐ, ఎస్సై

తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి

బాబుకు చెంపపెట్టు.. టీడీపీ గుట్టురట్టు

Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే

పోలీసుల నిర్లక్ష్యానికి దివ్యాంగురాలు బలి

200 మందితో అటాక్.. 9 ఎకరాల భూ కబ్జా!

Toxic Movie: టీజర్ తో మెంటలెక్కించాడుగా

తప్పుడు వార్తలతో అమరావతి రైతులపై కుట్ర

ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారం అనుకున్నారా.. ఏకిపారేసిన సాకే శైలజానాథ్

Jada Sravan: ఏపీలో ముగ్గురేనా మంత్రులు.. మిగతా మంత్రులకు సిగ్గు లేదా

Photos

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)

+5

చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)