ఈ జగన్ మనల్ని వదలడు.. సైలెంట్ గా ఫ్లైటెక్కి ఉస్కో !
చిరంజీవి చేతికి ఖరీదైన వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
Published on Thu, 01/08/2026 - 13:08
సెలబ్రిటీలు ఏ పని చేసినా అది వార్తే అవుతుంది. వారు తినే ఇండి మొదలు ధరించే దుస్తుల వరకు ప్రతీది..అభిమానులకు ఆసక్తికర అంశమే. ముఖ్యంగా సినీ నటులు ధరించే నగలు, వాచీలు, డ్రెస్సులపై తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ధరించే వాచ్‌పై నెట్టింట చర్చ మొదలైంది. నిన్న(జనవరి 7) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి స్టైలిష్ డ్రెస్‌లో వచ్చారు. చూసేందుకు చాలా సింపుల్‌గా ఉన్నా.. ఆయన ధరించిన డ్రెస్‌తో పాటు చేతికి పెట్టుకున్న వాచ్ కూడా బాగా ఖరీదైనవి.

మెగాస్టార్ చిరంజీవికి చేతికి వాచ్ ధరంచడం చాలా ఇష్టం. ఆయన దగ్గర రకరకాల బ్రాండ్లకు సంబంధించిన వాచీలు ఉన్నాయి. ఒక్కో ఈవెంట్‌కి ఒక్కో వాచ్ ధరించి వెళ్తుంటాడు. ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' ఈవెంట్‌కు ఆయన రోలెక్స్ బ్రాండ్ వాచ్ ధరించారు. రోలెక్స్‌లో అది రోలెక్స్ డేటోనా(Rolex Daytona) మోడల్. దాని ధర సుమారు రూ. 1.8 కోట్లు నుంచి రూ. 2.29 కోట్లు వరకు ఉంటుందట.

ఇదే కాదు.. గతంలోనూ చిరు ధరించిన వాచీల ధరలన్నీ దాదాపు కోటీ రూపాయలపైనే ఉంటుంది. ఆయన దగ్గర రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ కూడా ఉంది. దాని ధర ఒక కోటీ 86 లక్షలు.వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిల్ ఈవెంట్‌కి ఈ వాచ్ ధరించారు. దీంతో పాటు ఎ లాంగే అండ్ సోహ్నే (A. Lange & Söhne)కంపెనీకి చెందిన వాచ్ కూడా చిరు దగ్గర ఉంది. చిరు వాచీల ధరలను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.
Tags : 1