తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
Breaking News
రెస్టారెంట్ మేనేజర్‌గా ఇస్రో శాస్త్రవేత్త..!
Published on Thu, 01/08/2026 - 11:22
ఒక్కోసారి సరదాగా కొత్త వ్యక్తులతో జరిగే సంభాసణ అద్భుతంగానూ ఆసక్తికరంగానూ మారుతుంది. మనకు ఓ కొత్త విషయం తెలుస్తుంది కూడా. అలాంటి ఆసక్తికరమైన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. జీవిమంతే సానుకూలదృక్పథంతో అందంగా మలుచుకునేదనే చెప్పే గొప్ప సంభాషణ. ఎదురై సమస్యలను సింపుల్‌గా ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేసే గొప్ప జీవిత పాఠం కూడా. మరి అదేంటో చకచక చదివేద్దమా..!.
శాండో అనే ఒక కంటెంట్ క్రియేటర్ గతంలో ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేసిన ఒక రెస్టారెంట్ మేనేజర్‌ను కలిసిన ఆసక్తికర కథను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఒకరోజు ఒక సాధారణ రెస్టారెంట్ మేనేజర్‌తో జరిగిన సంభాషణ చివరికి ఇస్రో శాస్త్రవేత్తతో జరిగిన ముచ్చటగా మారింది అనే క్యాప్షన్‌ని జోడించి మరి వారి మధ్య జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నాడు.
ఆ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ..తాను ఇంతకుముందు ఇస్రోలో పనిచేశానని, అక్కడ సైంటిస్ట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించేవాడినని చెప్పుకొచ్చారు. సుమారు 16 ఏళ్ల పనిచేసినట్లు తెలిపారు. ఆ తర్వాత మానేసినట్లు తెలిపారు. అక్కడ ఒత్తిడి తట్టుకోలేకపోయినట్లు వివరించారు. శాటిలైట్‌లో పరికరాల అసెంబ్లీ చాలా క్లిష్టంగా ఉందంటూ దాని కనెక్ట్‌విటీ గురించి పూసగుచ్చినట్లు వివరించారు.
అక్కడ ఒక భాగాన్ని అసెంబుల్ చేసేందుకు టాలరెన్స్ 0.001 ఉంటుంది. కేవలం ఒక పూర్తి భాగాన్ని అసెంబుల్ చేయడానికి 10 భాగాలు ఉంటాయి. ఆ 10 భాగాలలో, ప్రతి ఒక్కటి 0.001, 0.002, 0.003 అలా వస్తాయి. ఏ భాగం ఎక్కడ సరిపోతుందో, అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ముందుగా అంచనా వేయాలని మాజీ శాస్త్రవేత్త అన్నారు. అవన్ని ఒక వెంట్రుక మందంలో సుమారు 0.004, అంటే సుమారు 4 మైక్రాన్లలలో ఉంటాయి.
మనం మనం 1 మైక్రాన్ టాలరెన్స్‌తో అసెంబ్లీ చేయాల్సి ఉంటుంది. రెండు భాగాలను అసెంబుల్ చేసిన తర్వాత లోపల ఒక్కటి డిస్‌కనెక్ట్ అయినా, అది 5 మైక్రాన్లు అవుతుంది. అంత ఖచ్చితత్వంతో పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆ ఒత్తిడిని తట్టుకోలేక విశ్రాంతి కోరుకున్నాని అన్నారు. అన్నింటికంటే మానసిక ప్రశాంత ముఖ్యమని అనిపించి ఇలా రెస్టారెంట్ మేనేజర్‌గా ప్రశాంతంగా పనిచేసే జీవితాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. తన నిర్ణయంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ..ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి లేదని ప్రశాంతంగా ఉన్నానని అన్నారు.
తనకు అమెరికాలో పనిచేసే అవకాశం కూడా వచ్చిందని అయితే తన డాక్యుమెంట్స్‌లో ఒక క్లరికల్ లోపం కారణంగా అది చేజారిపోయిందని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో భారీగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. ఉద్యోగ జీవితం వదులుకోవడానికి గల కారణం చాలామందిని తాకింది.
అంతేగాక అత్యున్నత స్థాయిని వదులుకుని సాధారణ స్థాయిని ఎంచుకునేటప్పుడూ కూడా ఒత్తిడి ఉంటుంది కానీ, దాన్ని ఎలా సానుకూలంగా తీసుకుని..ముందకు సాగాలో చెబుతుంది ఈ కథ. మొదట మన కంఫర్ట్‌కి ప్రాధాన్యత ఇస్తేనే..ఏ ఫీల్డ్‌లోనైనా హాయిగా కొనసాగగలం ఆ క్రమంలో వచ్చే సవాళ్లను సానుకూల దృక్పథంతో పరిష్కారించుకుంటూ సాగిపోవాలని చెప్పే ఈ స్టోరీ అందరి మనసులను దోచుకుంది.
(చదవండి: న్యూస్ పేపర్ రీడింగ్‌తో.. పోన్ చూడటం మానిపించగలమా?)
Tags : 1