75 శాతం సంపద సమాజానికే!.. కొడుకు మరణంతో తండ్రి నిర్ణయం

Published on Thu, 01/08/2026 - 09:40

వేదాంత గ్రూప్ చైర్మన్, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49) కన్నుమూశారు. న్యూయార్క్‌లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు అనిల్ అగర్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్.. న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారి కుటుంబం చెప్పిన దాని ప్రకారం.. అంతా బాగానే ఉంది.. బాగా కోలుకుంటున్నాడు అనుకుంటుండగానే అనుకోకుండా అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.

'ఈ రోజు నా జీవితంలో చీకటి రోజు. నా ప్రియమైన కుమారుడు అగ్నివేష్ చాలా 49 ఏళ్లకే మమ్మల్ని విడిచి వెళ్లాడు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. గండం గడిచిందనుకున్నాం. కానీ విధి వేరేలా నిర్ణయించింది. ఆకస్మిక గుండెపోటు మా కొడుకును మా నుండి దూరం చేసింది" అని అగర్వాల్ ’ఎక్స్’ ఒక పోస్ట్‌లో వెల్లడించారు.

1976 జూన్ 3న పాట్నాలో జన్మించిన అగ్నివేష్ అజ్మీర్ లోని మాయో కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఫుజీరా గోల్డ్ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. తరువాత హిందుస్థాన్ జింక్ చైర్మన్‌గా పనిచేశారు.

క్రీడలు, సంగీతం, నాయకత్వం, మానవత్వం ఇలా అన్నింటా తన కుమారుడు చురుగ్గా ఉండేవాడని రాసుకొచ్చిన అనిల్‌ అగర్వాల్‌.. దేశంలో ఏ పిల్లలూ ఆకలితో పడుకోకూడదని, ఏ బిడ్డకూ విద్య దూరం కాకూడాదని, ప్రతి మహిళా తన కాళ్లపై నిలబడాలని, ప్రతి భారతీయుడికీ చేసేందుకు పని ఉండాలని తాము కలలు కన్నామని గుర్తుచేసుకున్నారు. తమ సంపాదనలో 75 శాతానికిపైగా సమాజానికే తిరిగిస్తామని తమ కుమారుడికి వాగ్దానం చేశానని, ఇప్పుడు తాను ఆ వాగ్దానానికి మరింత కట్టుబడి ఉంటానని, ఇకపై మరింత నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతానని భావోద్వేగంతో పేర్కొన్నారు. అంతే కాకుండా నువ్వు లేకుండా ఈ మార్గంలో ఎలా నడవాలో నాకు తెలియదు, కానీ మీ వెలుగును ముందుకు తీసుకెళ్లడానికి నేను ప్రయత్నిస్తాను అని అన్నారు.

Videos

ఈ జగన్ మనల్ని వదలడు.. సైలెంట్ గా ఫ్లైటెక్కి ఉస్కో !

భోగాపురం అసలు కథ ఇది.. క్రెడిట్ దొంగ చంద్రబాబు

YSRCP ఆఫీసుకు నోటీసులు.. మున్సిపల్ కమీషనర్ పై హైకోర్టు ఆగ్రహం

రాజా సాబ్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో

టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం

బాబులో టెన్షన్.. జగన్ వ్యాఖ్యలపై మరో డ్రామా

సంక్రాంతి పండుగ వేళ మందు బాబులకు చంద్రబాబు షాక్

ఫార్చ్యూన్ 500కి భూమి ఫ్రీగా ఇవ్వడానికి నువ్వెవడివి కోన్ కిస్కా గొట్టం గాడివి

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

అమరావతి రైతులతో బాబు గేమ్.. YS జగన్ ఆగ్రహం

Photos

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)

+5

చంద్రబాబుది విలన్‌ క్యారెక్టర్‌.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కన్నడ 'మార్క్'తో సెన్సేషన్..క్వీన్‌ ఆఫ్‌ ‘మార్క్‌’గా దీప్శిఖ చంద్రన్ (ఫొటోలు)

+5

Yash Birthday : యశ్‌ అసలు పేరేంటో తెలుసా? (ఫోటోలు)

+5

తెలంగాణలో మొదలైన ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)