రూ.70 కోట్ల సినిమా.. 2.19 కోట్ల కలెక్షన్స్‌.. స్టార్‌ హీరోకి కోలుకోలేని దెబ్బ!

Published on Sat, 01/03/2026 - 11:54

గతంలో స్టార్హీరో సినిమాకి ఫ్లాప్టాక్వచ్చినా మినిమం కలెక్షన్స్వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా సరే..బలమైన కంటెంట్తో రాకపోతే ప్రేక్షకులు థియేటర్స్వైపే వెళ్లడం లేదు. సూపర్హిట్టాక్వస్తే తప్పా..సినిమాకు మినిమం కలెక్షన్స్రావడం లేదు. తాజాగా మలయాళ స్టార్హీరో మోహన్లాల్సినిమాకు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆయన నటించిన వృషభ మూవీ డిసెంబర్‌ 25 ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ డిజాస్టర్గా నిలిచింది.

దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రానికి మొత్తంగా రూ. 2.19 కలెక్షన్స్మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు శాతం మాత్రం రికవరీ చేసింది. ఓవర్సీస్‌లో అయితే ఈ మూవీ 8 రోజుల్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో రూ. 1.94 గ్రాస్కలెక్షన్స్వచ్చాయి. తెలుగులో అయితే సినిమాకు కనీస ఓపెనింగ్స్కూడా రాలేదు. తొలి రోజు రూ. 10 లక్షలు వస్తే..నాలుగో రోజు కేవలం రూ. లక్షకు మాత్రమే పరిమితమైంది. తెలుగు వెర్షన్లో మొత్తంగా రూ. 32 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా సినిమాకు దాదాపు రూ. 65 కోట్లకు పైనే నష్టం వచ్చేలా కనిపిస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్‌తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించిన చిత్రానికి నంద కిశోర్దర్శకత్వం వహించారు. స‌మ‌ర్జీత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)