బాలకృష్ణ, గోపీచంద్‌ల కథ కంచికి.. మేకర్స్‌ కీలక నిర్ణయం

Published on Sat, 01/03/2026 - 11:00

బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రానున్న కొత్త మూవీ కథను సైడ్‌ చేశారు. అయితే, మరో కథతో షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.  ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో ఈ మూవీ రానుంది. మొదట హిస్టారికల్‌ యాక్షన్‌ చిత్రంగా మేకర్స్‌ అనుకున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్‌ అయినా సరే తెరకెక్కించాలని నిర్మాత వెంకట సతీష్‌ కిలారు పూనుకున్నారు. అందుకోసం నయనతారను హీరోయిన్‌గా రంగంలోకి దింపారు. కానీ, ఇప్పుడు ఆ లెక్కలు అన్నీ మారిపోయాయి.

ఒక భారీ చారిత్రక కథలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించనున్నట్లు  మేకర్స్‌ గతంలోనే చెప్పారు. ఆపై విజువల్‌ వండర్‌గా గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ మూవీ ఉంటుందని తెలిపారు. కానీ, సడెన్‌గా నిర్మాత, హీరో, దర్శకుడు అంతా కలిసి మనసు మార్చుకున్నారు.  ఈ ప్రాజెక్ట్‌ను సైడ్‌ చేసి మరో కథతో షూటింగ్‌ ప్రారంభించాలని వారు డిసైడ్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం బడ్జెట్ అని తెలుస్తోంది.

ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా నిర్మించాలంటే భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుంది. కనీసం రూ. 150 కోట్ల వరకు బడ్జెట్‌ అవుతుంది అని టాక్‌.. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌ పరిస్థితి అంత మెరుగ్గాలేదు. పైగా అఖండ-2ను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేసినా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆపై ఓటీటీ ఆదాయం కూడా పెద్దగా లేదు. బాలయ్య మార్కెట్‌ ప్రకారం అంత బడ్జెట్‌ వర్కౌట్‌ కాదని తెలిసి మరో కథతో సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
 

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)