రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆది సాయికుమార్‌ దంపతులు

Published on Sat, 01/03/2026 - 08:01

నటుడు సాయి కుమార్‌ ఇంట వారసుడు జన్మించాడు. ఆది సాయికుమార్, అరుణ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. సోషల్‌మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. దీంతో తన సన్నిహితులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వారికి ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. అయితే, పాప పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లో వారసుడు జన్మించాడు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. శంబాల సినిమా సక్సెస్‌తో పాటు కొత్త ఏడాదిలో వారసుడి రాకతో సాయికుమార్‌ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారట.

2014లో అరుణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని ఆది పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి అయ్యాడు. జనవరి 2న పండంటి బాబుకు అరుణ జన్మనిచ్చారు. దీంతో ఆదికి ఈ కొత్త ఏడాది శుభవార్తతో ప్రారంభమైంది. 

శంబాల కలెక్షన్స్‌..
చాలా ఏళ్ల తర్వాత శంబాల మూవీతో ఆది సాయికుమారు భారీ విజయాన్ని అందుకున్నారు. యుగంధర్‌ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.  క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఆది కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా శంబాల రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.
 

 

 

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)