మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !
ఈ పెళ్లికి యాచకులే వీఐపీలు!
Published on Sat, 01/03/2026 - 07:18
పెళ్లికి బంధువులు, స్నేహితులను పిలవడం కొత్తేమీ కాదు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజిపూర్‌కు చెందిన సిద్దార్థ్ తన సోదరి వివాహానికి యాచకులను స్పెషల్ గెస్ట్‌లుగా ఆహ్వానించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తన సోదరి వివాహనికి హాజరైన యాచకులను సిద్దార్థ్ ఆత్మీయంగా ఆహ్వాస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. వారు విందుభోజనాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తాయి.
అలాంటి ఖరీదైన, రుచికరమైన భోజనాన్ని తినడం వారిలో చాలామందికి అదే మొదటిసారి.
కడుపు నిండా భోజనం చేసిన యాచకులలో కొందరు సంతోషంతో నృత్యం చేశారు!
వివాహానికి కొన్నిరోజుల ముందు సిదార్థ్ వివిధ ప్రాంతాలకు పనిగట్టుకుని వెళ్లి మరీ యాచకులను ఆహ్వానించాడు.
‘ఈ యాచకులలో ఎంతమంది అర్ధాకలితో ఉన్నారో, ఎంతమంది కొన్నిరోజుల పాటు భోజనానికి దూరమయ్యారో. ఇలాంటి దీనులకు వరంలాంటి పెళ్లివిందు ఇది’
‘అంతులేని ఆడంబరాలతో, అనవసర ఖర్చుతో మన దేశంలో వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఒక్క రోజైనా పెళ్లి విందు రూపంలో దీనుల కడుపు నింపడం అద్భుతమైన పని’
‘విందు భోజనాల సమయంలో యాచకులు కనిపిస్తే విసుక్కుంటూ వారిని దూరంగా తరిమే దృశ్యాలను చాలా చూశాను. ఇలా మనసును కదిలించే దృశ్యం చూడడం ఇదే తొలిసారి’
‘మానవత్వానికి అద్దం పట్టే అరుదైన వీడియో’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి.
Tags : 1