ఆనంద్ మహీంద్రా న్యూ ఇయర్ సందేశం

Published on Fri, 01/02/2026 - 13:42

కృత్రిమ మేథ (ఏఐ)తో ఫ్యాక్టరీ టెక్నీషియన్లు, మెషినిస్టుల్లాంటి బ్లూకాలర్‌ ఉద్యోగులకు ముప్పేమీ ఉండదని, ప్రాక్టికల్‌ నైపుణ్యాలను వినియోగించి వారు మరింత ఆదాయం ఆర్జించేందుకు తోడ్పడే యాక్సిలరేటరుగా ఇది ఉపయోగపడుతుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.

ఇంటెలిజెంట్‌ సిస్టమ్‌లు రొటీన్‌ పనులను నిర్వహించడం వల్ల ప్రాక్టికల్‌ నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని, ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఏఐ గురించి ఆందోళన చెందకుండా టెక్నీషియన్లు దానితో ధీమాగా కలిసి పని చేసే విధంగా మార్పులు వస్తాయని వివరించారు. దీన్ని తాము ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ పరమైన పరిణామాలతో బ్లూకాలర్‌ ఉద్యోగాలు కాస్తా ఆకర్షణీయమైన గోల్డ్‌ కాలర్‌ ఉద్యోగాలుగా మారతాయని తెలిపారు.

ఇదీ చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ: స్పందించిన జొమాటో సీఈఓ

మారుతున్న టెక్నాలజీ, భౌగోళిక - రాజకీయపరమైన పరిణామాలతో నూతన సంవత్సరంలో సర్వత్రా అనిశ్చితి నెలకొనవచ్చని మహీంద్రా చెప్పారు. అయితే అనిశ్చితిని శత్రువుగా పరిగణించకుండా, మన సత్తా నిరూపించుకునే అవకాశంగా భావించాలని సూచించారు. 2025లో ఎస్‌యూవీలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రిక్‌ త్రీ-వీలర్లు, మహీంద్రా ఫైనాన్స్‌ తదితర వ్యాపార విభాగాల్లో గ్రూప్‌ గణనీయ విజయాలు సాధించిందని ఆనంద్‌ మహీంద్రా చెప్పారు.

#

Tags : 1

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)