అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
మానవత్వం, ప్రకృతి మధ్య సంభాషణను నృత్య రూపకంగా..!
Published on Thu, 01/01/2026 - 17:31
పరంపర ఫౌండేషన్ హైదరాబాద్ జనవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు నార్సింగిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దివ్య సమ్మేళనాన్ని నిర్వహించనుంది. ఈవెంట్లో వివర్త: ట్రాన్స్ఫర్మేషన్స్','పరమమ్ అనే రెండు ప్రదర్శనలు ఉంటాయి. USAలోని కళా మందిర్‌కు చెందిన సుజాత శ్రీనివాసన్ నృత్యం, సంగీతం ద్వారా మారుతున్న వాతావరణం, భావోద్వేగ ప్రయణాన్ని ప్రదర్శించనున్నారు.
ఒక్క ప్రశ్నతో మొదలై..మానవత్వం ప్రకృతి మధ్య సంభాషణను ఎలా పరిశీలిస్తుందనేది ఈ ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. పపరమం, కొరియోగ్రఫీ అమెరికాలోని నాట్యాంజలి కూచిపూడి నృత్య పాఠశాలకు చెందిన శ్రీలత సూరి, సూర్యాష్టకం, మీనాక్షి పంచరత్నం, భూదేవి వరాహ ప్రీమియర్ వంటి ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ 45 నిమిషాల ప్రదర్శన దైవిక, సహజ ప్రపంచాన్ని కలుపుతుంది. ఈ శాస్త్రీయ నృత్య ప్రదర్శన బలం, దయ, రక్షణ థీమ్‌లను హైలైట్ చేస్తుంది.
(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్‌తో మొదటి సంపాదన..!)
Tags : 1