అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
ఓటీటీలో 'రాజ్ తరుణ్' సినిమా.. ఈ ఏడాది ఫస్ట్ సినిమా ఇదే
Published on Thu, 01/01/2026 - 14:46
రాజ్ తరుణ్ నటించిన 'పాంచ్‌మినార్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, తాజాగా మరో ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేసింది. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్ కాగా బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.
జనవరి 1 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో పాంచ్ మినార్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ మెప్పించలేకపోయింది. దీంతో కేవలం వారానికే అమెజాన్ ప్రైమ్‌లో మొదటగా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన విషయం తెలిసిందే.. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఆహాలో ఈ ఏడాది ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం.

కథేంటి..?
కిట్టు (రాజ్ తరుణ్) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్‌కాయిన్ స్కామ్ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్ బుక్ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే!
Tags : 1