CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
Breaking News
నాతో డేట్‌కు రా.. ఎంత తీసుకుంటావ్?: హీరోయిన్‌కు ప్రపోజల్
Published on Wed, 12/31/2025 - 14:46
సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లు చాలామంది. వారితో ఒక్క సెల్ఫీ అయినా దిగాలని, నేరుగా చూడాలని.. ఇలా చాలా కలలు కంటుంటారు. కొందరైతే ఏకంగా ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్ కూడా పంపిస్తుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్ సనా ఆల్తఫ్‌కు అలాంటి ప్రపోజలే వచ్చింది.
డేటింగ్ ప్రపోజల్
డేట్‌కు రమ్మని ఓ వ్యక్తి పదేపదే మెసేజ్ చేస్తున్నాడంటూ ఈమెయిల్‌లో వచ్చిన సందేశాలను స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేసింది. అందులో ఏముందంటే.. డియర్ సనా.. ఎలా ఉన్నావు? నేను చెన్నైకి చెందిన వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త బాలాజీని. నాకు నీతో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది. దానికి ఎంత తీసుకుంటావో చెప్పు.. అలాగే ఎప్పుడు వీలవుతుందో కూడా తెలియజేయు.
మాల్దీవులు, దుబాయ్..
దాన్నిబట్టి మనం ప్రోగ్రామ్ పెట్టుకుందాం. అయితే ఇండియాలో లేదంటే మాల్దీవులు, దుబాయ్‌కు వెళదాం. ఒక్కసారి ఆలోచించు అని బాలాజీ అనే వ్యక్తి రాసుకొచ్చాడు. ఇలా పలుమార్లు మెయిల్ చేశాడు. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసిన సనా.. ఎంత ప్రొఫెషనల్‌గా, రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడో.. అని సరదాగా చమత్కరించింది.
సినిమా
సనా ఆల్తఫ్ 'విక్రమాదిత్య' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ మలయాళ మూవీలో దుల్కర్ సల్మాన్ సోదరిగా నటించింది. తర్వాత 'మరియం ముక్కు' మూవీలో ఫహద్ ఫాజిల్ సరసన హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. 'రాణి పద్మిని', 'ఓడియన్' చిత్రాల్లోనూ మెరిసింది. తమిళంలో 'ఆర్‌కే నగర్', 'పంచరాక్షరం' సినిమాలు చేసింది.

చదవండి: హీరో విజయ్ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్
Tags : 1