Breaking News

మండల పూజ సీజన్‌లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు

Published on Tue, 12/30/2025 - 15:50

శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయం ఈ ఏడాది మండల-మకరవిళక్కు సీజన్ కోసం నవంబర్ 16 సాయంత్రం తలుపులు తెరిచింది. 41 రోజుల మండల పూజ కాలం పూర్తయినందున నవంబర్ 16 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబర్ 27 సాయంత్రం ఆలయం మూసివేయబడింది. తిరిగి డిసెంబర్ 30న మకర ఉత్సవాల కోసం తెరిచింది దేవస్వం బోర్డు. 

రికార్డ్ బ్రేకింగ్ రెవెన్యూ

దేవస్వం బోర్డు గత రికార్డులన్నింటినీ అధిగమించి ఆలయ ఆదాయంలో చారిత్రాత్మక పెరుగుదలను ప్రకటించింది. తాజా గణాంక నివేదిక ప్రకారం:

మొత్తం ఆదాయం: గత 41 రోజుల్లోనే, ఆలయం రూ. 332.77 కోట్లు వసూలు చేసింది.

అరవణ పాయసం అమ్మకాలు రూ. 142 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ. 12 కోట్లు వచ్చాయి.

హుండీ (ఉడియల్) మొత్తం రూ. 83.17 కోట్లు.

గతేడాది మండల పూజ ఆదాయం రూ. 297.06 కోట్లతో పోలిస్తే, ఈ సీజన్‌లో ఆలయం రూ. 35.70 కోట్ల ఆకట్టుకునే పెరుగుదలను చూసింది.

రికార్డు స్థాయి దర్శనాలు..

ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 30,91,183 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

స్పాట్ బుకింగ్ ద్వారా 4,12,075 మంది వచ్చారు.

పుల్మేడు అటవీ మార్గం ద్వారా 1,29,933 మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు.

గతేడాది మండల సీజన్‌లో 32,49,756 మంది భక్తులు సందర్శించగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3,83,435 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం విశేషం.

(చదవండి: శబరిమల యోగా దండం, జప మాల మరమ్మత్తు పనుల కేసుపై సిట్‌ దర్యాప్తు ముమ్మరం)

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)