తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
Breaking News
చీరకట్టుకున్నా భద్రత లేదు.. వీడియో షేర్ చేసిన 'చిన్మయి'
Published on Mon, 12/29/2025 - 11:25
మహిళల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దుస్తుల అంశం ఏకంగా వర్గాల వారిగా దూషించుకునే స్థాయికి చేరుకుంది. మహిళల అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుందంటూ.. ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదని అసభ్యకరమైన భాషలో శివాజీ చెప్పాడు. దీంతో చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
తాజాగా చిన్మయి ఒక వీడియోను షేర్ చేశారు. మహిళల వస్త్రధారణ చక్కగా ఉన్నప్పటికీ కూడా భద్రత లేదంటూ సింగర్ చిన్మయి మరోసారి కౌంటర్ ఇచ్చింది. చీరకట్టులోనే గౌరవం ఉంటుందని చెబుతున్న వారి వ్యాఖ్యలకు వీడియోతో తనదైనశైలిలో పేర్కొన్నారు. కేరళకు చెందిన మహిళలు నిండుగా చీర కట్టుకుంటారని, దీంతో వారిని ఎవరూ ముట్టుకోరు, ఇబ్బంది పెట్టరు అని వచ్చిన కామెంట్‌కు చిన్మయి సమాధానం చెప్పింది. కేరళలోనే ఒక మహిళ పరిస్థితి ఇదీ అంటూ వీడియో పోస్ట్ చేసింది.
“Women in Kerala never get abused nobody touches them because they wear Sari”
Meanwhile. pic.twitter.com/mBPsrukScd— Chinmayi Sripaada (@Chinmayi) December 28, 2025
Tags : 1