తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
Breaking News
‘సినిమా టికెట్ ధరలు భారం కావు’ సగటు ధర ఎంతంటే..
Published on Mon, 12/29/2025 - 10:01
మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడటం సామాన్యులకు భారంగా మారుతోందన్న విమర్శలపై పీవీఆర్ ఇనాక్స్ (PVR INOX) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ వివరణ ఇచ్చారు. పీవీఆర్ సినిమాస్ టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ అధికారిక గణాంకాలతో కూడిన వివరాలను వెల్లడించారు. 2025 డిసెంబర్ నాటి ఆర్థిక నివేదికల ప్రకారం, పీవీఆర్ నెట్‌వర్క్‌లో సగటు టికెట్ ధర రూ.259 మాత్రమే ఉందని పేర్కొన్నారు.
విమర్శలపై వివరణ
చాలామంది ప్రేక్షకులు లగ్జరీ స్క్రీన్లు లేదా ప్రీమియం థియేటర్ల ధరలను చూసి మొత్తం చైన్(పీవీఆర్ ఐనాక్స్‌లోని అన్ని థియేటర్లు) అంతా అలాగే ఉంటుందని అపోహ పడుతున్నారని ఆయన అన్నారు. ‘లగ్జరీ స్క్రీన్లలో ధరలు రూ.600-700 ఉండొచ్చు. కానీ అది అందరికీ కాదు. హెడ్‌లైన్స్ చూసి ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు తప్ప, పూర్తి వివరాలు చూడటం లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. పాప్‌కార్న్ ధరలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. సాధారణ పాప్‌కార్న్ ధర కేవలం రూ.159 నుంచే మొదలవుతుందని, రూ.400 వరకు ఉండే పాప్‌కార్న్ బకెట్లపై ‘అన్లిమిటెడ్ రిఫిల్స్’ సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు.
ప్రేక్షకులకు ఆఫర్లు
సామాన్య ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పీవీఆర్ ఇనాక్స్ పలు రకాల స్కీమ్స్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని స్క్రీన్లల్లో మంగళవారాల్లో టికెట్ ధరలను రూ.95 - రూ.100 వరకు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. వారాంతాల్లో ఫుడ్ ఐటమ్స్ మీద ప్రత్యేక రాయితీలు, అన్లిమిటెడ్ రిఫిల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘పీవీఆర్ పాస్’ వంటి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ద్వారా తక్కువ ధరకే ఎక్కువ సినిమాలు చూసే వీలుందని చెప్పారు.
బిగ్ స్క్రీన్ అనుభవం
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా బిగ్ స్క్రీన్ ఇచ్చే అనుభవం ఎప్పటికీ ప్రత్యేకమేనని బిజ్లీ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్, కంఫర్టబుల్ సీటింగ్, హై-క్వాలిటీ విజువల్స్ అందించడానికి రూ.259 సగటు ధర అనేది అత్యంత సమంజసమైనదని సమర్థించుకున్నారు.
ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?
Tags : 1