తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
Breaking News
మధ్యతరగతి మదుపు.. ప్రశ్నలు.. సమాధానాలు
Published on Mon, 12/29/2025 - 08:25
ప్రతి మధ్యతరగతి కుటుంబానికి డబ్బుతో కూడిన చాలా కలలు ఉంటాయి. సొంతిల్లు, పిల్లల చదువులు, బంగారం, సురక్షితమైన పదవీ విరమణ.. ఇవన్నీ నెరవేరాలంటే కేవలం సంపాదన ఉంటే సరిపోదు, సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ప్రస్తుత కాలంలో సామాన్యులు తమ పొదుపు ప్రయాణంలో ఎదుర్కొంటున్న ప్రధాన సందేహాలకు నిపుణుల సమాధానాలు ఇవే..
రియల్టీ..
సొంతిల్లు కొనుక్కోవటానికి కరెక్టు వయసంటూ ఏమైనా ఉందా?
సొంతిల్లు ఫలానా వయసులోనే కొనుక్కోవాలనే నియమం కానీ, నిబంధన కానీ ఏమీ లేదు. ఇక్కడ వయసుకన్నా దీర్ఘకాలం సెటిల్మెంట్ ముఖ్యం. మీరు గనక తరచూ ప్రాంతాలు మారాల్సి వచి్చందనుకోండి. అప్పుడు సొంతిల్లు కొనుక్కునీ ప్రయోజనం ఉండదు. స్థిరమైన ఆదాయం లేనప్పుడు సొంతింటి లాంటి ఆలోచనలు చేయకూడదు. అందుకని వయసు కన్నా ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలం అదే ప్రాంతంలో ఉండే అవకాశం, స్థిరమైన ఆదాయం అనేవి ప్రధానం.
బ్యాంకింగ్..
ప్రతినెలా నా ఆదాయంలో కొంత మిగులుతోంది. దీన్ని సిప్ చేయటం మంచిదా... లేక రికరింగ్ డిపాజిట్ చేయొచ్చా?
రికరింగ్ డిపాజిట్... సిప్, రెండూ మంచివే. కాకపోతే రికరింగ్ డిపాజిట్లో భద్రత ఎక్కువ. కానీ రాబడి పరిమితంగా ఉంటుంది. సిప్ అనేది స్టాక్ మార్కెట్లకు, మ్యూచువల్ ఫండ్లకు మంచిదే. దీన్లోనూ భద్రత ఉంటుంది కానీ... గ్యారంటీ ఉండదు. అయితే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు సిప్‌తోనే సాధ్యమవుతాయి. కాబట్టి మీరు దీర్ఘకాలం వేచి చూసేటట్లయితే సిప్‌ను, స్వల్ప కాలానికైతే ఆర్డీని ఎంచుకోండి.
బంగారం
బంగారంలో నెలవారీ ఇన్వెస్ట్ చేయొచ్చా? దీనికున్న సాధనాలేంటి?
నెలవారీనే కాదు. వారం, రోజువారీ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నపుడు భౌతికంగా గోల్డ్‌ను కొనే ప్రయత్నాలు వద్దు. డిజిటల్ గోల్డ్ లేదా గోల్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయండి. రకరకాల ఫిన్‌టెక్ యాప్‌లు కూడా అత్యంత సులువుగా గోల్డ్‌లో ఎప్పుడు, ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కలి్పస్తున్నాయి. మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ... ధర పతనమైనప్పుడు ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయటమూ మంచిదే.
స్టాక్ మార్కెట్...
2026లో ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
చాలా ఐపీఓలు అధిక ధరలతో వస్తున్నాయి. కాబట్టి లిస్టింగ్‌లో రకరకాల కారణాల వల్ల లాభాలొచి్చనా అవి ఎక్కువకాలం నిలవటం లేదు. ఇప్పటి ఐపీఓలు కొని దీర్ఘకాలం ఉంచుకునేట్లుగా లేవు. కాబట్టి కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి, వాళ్లు తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్నారనిపిస్తేనో, కంపెనీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంటేనో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లిస్టింగ్ లాభాల కోసం మాత్రం ఐపీఓల వెంట పడొద్దు. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగులేని పక్షంలో లిస్టింగ్నాడే పనతమయ్యే అవకాశాలూ ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్...
నేను కొన్ని సంవత్సరాలుగా ‘సిప్’ చేస్తున్నాను. ఇప్పుడు ఆపేయవచ్చా?
సిప్‌లో ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశామన్నది ముఖ్యం కాదు. ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేశాం... మనకు ఎంత రాబడులు వచ్చాయి అనేవే ముఖ్యం. మీరు ఏ లక్ష్యం కోసమైతే ఇన్వెస్ట్ చేశారో ఆ లక్ష్యం నెరవేరిందని అనుకోండి. అప్పుడు సిప్ ఆపేయొచ్చు. లేకపోతే మీకు సిప్ వల్ల బాగా నష్టాలు వస్తున్నాయని అనుకుందాం... అపుడు తాత్కాలికంగా సిప్‌ను నిలిపేసి అంతకన్నా ఎక్కువ రాబడులొచ్చే మార్గాలేమైనా ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఇన్సూరెన్స్
నాకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అది సరిపోతుందా?
సరిపోదు. ఎందుకంటే కవరే జీ మొత్తం చాలా పరిమితంగా ఉంటుంది. పైపెచ్చు ఉద్యోగానితో ముడిపడి ఉంటుంది. ఉద్యోగం పోతే బీమా ఉండదు. నిబంధనలపై మీకు ఎలాంటి నియంత్రణా ఉండదు. ఇక చాలా గ్రూప్ ఇన్సూరెన్స్‌లలో కుటుంబ సభ్యులకు పరిమితి ఉంటుంది. తల్లిదండ్రులకు కవరేజీ ఉండదు. వీటన్నిటితో పాటు ఉద్యోగానంతరం మీకు సొంత ఆరోగ్య బీమా కావాలంటే ప్రీమియం రూపంలో చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మొదట్నుంచీ ఉంటే తక్కువ ప్రీమియంతో సరిపోతుంది.
ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?
Tags : 1