హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
Breaking News
‘45’ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు : శివరాజ్ కుమార్
Published on Sun, 12/28/2025 - 08:48
‘‘అర్జున్ జన్య చెప్పిన ‘45’ కథ నచ్చడంతో ‘మీరే డైరెక్ట్ చేయండి’ అని చెప్పాను. తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు అర్జున్. ఈ మూవీ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు... గౌరవిస్తారు. బతికినన్ని రోజులు హ్యాపీగా జీవించాలని మా చిత్రం చెబుతుంది’’ అని శివ రాజ్‌కుమార్ తెలిపారు.
సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘45’. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జనవరి 1న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ ఎవ్వరూ ఇవ్వని పాత్రను నాకు ఈ సినిమాలో అర్జున్ ఇచ్చారు. స్క్రీన్‌ప్లేని చాలా గ్రిప్పింగ్‌గా రాశారు అర్జున్. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ‘45’ని కూడా సపోర్ట్ చేయాలి’’ అని చెప్పారు.
‘‘45’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు’’ అన్నారు అర్జున్ జన్య ‘‘గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పే చిత్రమిది’’ అని రమేశ్ రెడ్డి తెలిపారు. ‘‘మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు మైత్రీ శశి.
Tags : 1