రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి

Published on Sat, 12/27/2025 - 21:01

సెలబ్రిటీలు స్టేజీ ఎ‍క్కితే చాలా మాట్లాడేస్తుంటారు. కొన్నిసార్లు రాబోయే సినిమాల గురించి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారు. మూవీ హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం ఈ వ్యాఖ్యలు రివర్స్ కొడుతుంటాయి. రీసెంట్ టైంలో శివాజీ, స్టేజీపై మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి కామెం‍ట్స్ చేశాడో చూశాం. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ 'రాజాసాబ్' గురించి ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

'మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి తీసిన ఈ 'రాజాసాబ్' సినిమా.. ఈ సంక్రాంతికి గులాబ్ జామ్‌లు గలగలాడించకపోతే.. అలాగే కోడి గుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త. రాసిపెట్టుకోండి. 'ద రాజాసాబ్'.. రూ.2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా నా డబ్బులు, ఆ డబ్బులు మనందరం కలిసి ఇద్దాం' అని సప్తగిరి కామెంట్స్ చేశాడు. కచ్చితంగా వీటిపై మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ రావడం గ్యారంటీ.

'రాజాసాబ్' సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన పూర్తిస్థాయి కమర్షియల్ మూవీ ఇది. జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. చూడాలి మరి ఈ మూవీ సప్తగిరి చెప్పినట్లు రూ.2 వేల కోట్లు సాధిస్తుందో లేదో?

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)