'భర్త మహాశయుల..' కోసం రవితేజ భారీ త్యాగాలు

Published on Sat, 12/20/2025 - 20:24

హీరో రవితేజ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు మాత్రం ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడంతే అనేలా పరిస్థితి తయారైంది. గత మూడు నాలుగేళ్లలో 'క్రాక్', 'ధమాకా' లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ ఫ్లాప్ అవడంతో పాటు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీ చేతిలో ఉంది. దీనికోసం రవితేజ భారీ త్యాగాలే చేశాడు. తాజాగా ఆ విషయాల్ని దర్శకనిర్మాత బయటపెట్టారు.

దర్శకుడు కిశోర్ తిరుమల తీసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్.. ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపించేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమాలో నటించడంతో పాటు కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి త్యాగాలని రవితేజ చేశాడు. ఈ మూవీ కోసం అడ్వాన్స్ గానీ రెమ్యునరేషన్ గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో బయటపెట్టారు. ఇదే చిత్రం కోసం రవితేజ.. తన 'మాస్ మహారాజా' ట్యాగ్ కూడా పక్కనబెట్టేశారని దర్శకుడు చెప్పాడు.

ఇదంతా చూస్తుంటే రవితేజకు కూడా తన పరిస్థితి అర్థమైనట్లు కనిపిస్తుంది. అందుకే ఇలా త్యాగాలు చేస్తున్నాడా అని సందేహం వస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇవన్నీ సినిమాని హిట్ చేస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా ప్రేక్షకుడు, కంటెంట్ చూసే థియేటర్‌కి వెళ్తున్నాడు. చిన్న సినిమానా పెద్ద సినిమానా.. చిన్న హీరోనా పెద్ద హీరోనా అని అస్సలు ఆలోచించట్లేదు. వరస ఫ్లాప్స్ వల్ల రవితేజ మార్కెట్ ఇప్పటికే బాగా దెబ్బతింది. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేయమని నిర్మాతని కోరాడు. అందుకు తగ్గట్లే జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈసారి హిట్ పడితేనే రవితేజకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.

Videos

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

కోతుల కోసం చింపాంజీ ఐడియా

Photos

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)