థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్!

Published on Sun, 12/14/2025 - 12:48

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మౌగ్లీ. కలర్‌ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. అఖండ-2 రావడంతో ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌ నిర్మించారు.

అయితే ఈ మూవీని యాంకర్ సుమ తన కుమారుడితో కలిసి వీక్షించింది. తెరపై కొడుకు నటనను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. థియేటర్లోనే తన కుమారుడు రోషన్‌ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ అమ్మ ప్రేమ అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ నటులు బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలో మెప్పించారు.

మోగ్లీ కథేంటంటే..

తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఈ సినిమాలో బండి సరోజ్‌ కుమార్‌పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో తెరకెక్కించిన కథే మౌగ్లీ.
 

 

Videos

ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి

లోకేష్.. నీ జాకీలు తుస్..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 31 సీట్లే.. IITians సంచలన సర్వే రిపోర్ట్!

నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్

అప్పుడే 2027 పొంగల్ పై..! కన్నేసిన సీనియర్ హీరోస్

భార్యను హత్య చేసి బైక్ పై మృతదేహాన్ని..

అనకొండ అవులిస్తే...!

బంగారుకొండ.. మానుకొండ.. మరో వీడియో రిలీజ్ చేసిన కొలికపూడి

ముంచుకొస్తున్న ప్రళయం.. డేంజర్ లో ఆ 5 దేశాలు!

సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ.. నేతల కొట్లాట

Photos

+5

సింగర్ స్మిత 'మసక మసక' సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే లవర్.. భర్తకు హీరోయిన్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ డేట్ లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లయి ఏడాది.. కీర్తి సురేశ్ ఇంత హంగామా చేసింది? (ఫొటోలు)

+5

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 14-21)

+5

టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి బర్త్ డే స్పెషల్(గ్యాలరీ)

+5

ఉప్పల్‌.. ఉర్రూతల్‌.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్‌ (ఫొటోలు)

+5

పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ ఆదా శర్మ.. ఫోటోలు

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)