మిసెస్ మామ్ గ్రాండ్ ఫినాలె..!

Published on Tue, 12/09/2025 - 17:02

ఇటీవ‌లి కాలంలో ప్ర‌స‌వం అంటేనే సిజేరియ‌న్ అంటున్నార‌ని, వాటి కంటే సుర‌క్షిత‌, సాధార‌ణ‌ ప్ర‌స‌వాలే ఎప్పుడూ శ్రేయ‌స్క‌ర‌మ‌ని కిమ్స్ గ్రూప్ ఆస్ప‌త్రుల సీఈఓ డాక్ట‌ర్ అభిన‌య్ తెలిపారు. సాధార‌ణ ప్ర‌స‌వాల మీద అవ‌గాహ‌న పెంపొందించే ల‌క్ష్యంతో డాక్ట‌ర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేష‌న్‌, కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ మిసెస్ మామ్ తొమ్మిదో సీజ‌న్ గ్రాండ్ ఫినాలె కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్. శిల్పిరెడ్డి,  డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  

ఈ  ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. తొమ్మిదో సీజ‌న్‌కు మొత్తం 220 జంట‌లు పేర్లు న‌మోదుచేసుకోగా వారిలో 57 జంట‌లు గ్రాండ్ ఫినాలెకు అర్హ‌త సాధించారు. వారంద‌రినీ డాక్ట‌ర్ అభిన‌య్‌ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మ‌ధురానుభ‌వం అని, అందులోని ప్ర‌తి ద‌శ‌నూ త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఆస్వాదించాల‌ని తెలిపారు. గ‌ర్భిణి అయిన భార్య‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డంతో పాటు, పుట్ట‌బోయే బిడ్డ సంర‌క్ష‌ణ విష‌యంలో కూడా తండ్రుల‌ది చాలా కీల‌క పాత్ర అని ఆయ‌న చెప్పారు. 

భ‌ర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య త‌న మాతృత్వాన్ని మ‌రింత ఆస్వాదించ‌గ‌ల‌ద‌ని వివ‌రించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభినయ్ అన్నారు. గ్రాండ్ ఫినాలెకు హాజ‌రైన అతిథులు, జంట‌ల‌ను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ.. “సాధార‌ణ ప్ర‌స‌వాల‌ను ప్రోత్స‌హించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాం. త‌ల్లిదండ్రులు ఏం తినాలి, పిల్ల‌ల‌కు ఏం పెట్టాల‌నే అంశాల‌ను వారికి వివ‌రించాం. 

70-80 ర‌కాల అంశాల‌ను ఈ త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం చేశాం. ఇంత‌మందికి ఒకేచోట అవ‌గాహ‌న క‌ల్పించ‌గలిగితే వాళ్లు స‌మాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధార‌ణ ప్ర‌స‌వం అన‌గానే నొప్పులు భ‌రించ‌లేం అన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇది త‌ప్పు. గ‌తంలో అన్నీ సాధార‌ణ ప్ర‌స‌వాలే ఉండేవి. త‌ర్వాత క్ర‌మంగా వివిధ కార‌ణాల‌తో సిజేరియ‌న్లు పెరిగాయి. ప్ర‌స‌వం అనేది సహ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. దాన్ని అలాగే జ‌ర‌గ‌నివ్వాలి. ఇంత‌కుముందు సీజ‌న్ల‌లో పాల్గొన్న‌వారిలో 85% మందికి సాధార‌ణ ప్రస‌వాలే జ‌రిగాయి. వ‌క్రీక‌ర‌ణ‌లు చాలా జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి, వీరికి అవ‌గాహ‌న పెంచాలి. ఇక్క‌డ పాల్గొన్న‌వారు త‌మ బంధువులు, స్నేహితుల‌కు చెప్పినా నెమ్మ‌దిగా స‌మాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు. గర్భధారణ సంరక్షణ తోపాటు భవిష్యత్తు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించారు. 

చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)