Breaking News

రష్మిక ముఖంపై అన్ని రంగులెందుకు?.. ది గర్ల్‌ఫ్రెండ్‌ డైరెక్టర్ రిప్లై ఇదే!

Published on Sun, 12/07/2025 - 16:33

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గతనెల థియేటర్లలో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్‌ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.

అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ బ్రేకప్‌ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఈ మూవీకి థియేటర్ల వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్‌ రష్మిక లుక్‌పై కామెంట్‌ చేశాడు. క్లైమాక్స్‌ సీన్‌లో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు? ఇది చాలా పవర్‌ఫుల్‌ మూవీనే.. కానీ అర్జున్ రెడ్డికి, ది గర్‌ఫ్రెండ్‌కి సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించాడు.

నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ మూవీకి ఏ సినిమాతోనూ సంబంధం లేదన్నారు. ఈ రంగులు ఆమెను సిగ్గుపడేలా, అవమానించడానికి విక్రమ్ ఉపయోగిస్తాడు.. అలా  వాటిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఆమెలో ఇప్పుడొక భాగమని కూడా తెలుసు.. ఆ అంగీకారమే తనను మరింత బలంగా, అజేయంగా చేసిందన్నారు. ఒకప్పుడు ఇంట్రావర్ట్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు  కళాశాల అందరి ముందు  ఈ రంగులతో నిలబడటానికి ఆలోచించదు.. దాన్ని చెప్పడానికి ఉద్దేశించినదే ఆ రంగుల ఎంపిక. సింపుల్‌గా చెప్పాలంటే మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!అని చెప్పడమేనని రాహుల్ ట్విటర్‌లో రిప్లై ఇచ్చారు. 
 

 

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు