Breaking News

సింగర్‌ తల్లి నోట పాట.. వీడియో వైరల్‌

Published on Thu, 12/04/2025 - 08:26

హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్‌ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఇందులో సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌, జీఎం సుందర్‌, శిల్పామంజునాథ్‌, ఆనంద్‌రాజ్‌, కరుణాకరన్‌, రమేష్‌ తిలక్‌, పీఎల్‌ తేనప్పన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్‌ ప్రతాపంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి నలన్‌ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని, జార్జ్‌ విలియమ్స్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్‌ 12న తెరపైకి రానుంది.

ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్‌ చిత్రంలోని 'రాజా విన్‌ పార్‌ర్వై రాణి ఇన్‌ పక్కం..' పాటకు రీమిక్స్‌ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్‌ నారాయణన్‌ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్‌ సూపర్‌.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్‌, అతిథిరావ్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, గాయకుడు విజయ్‌ ఏసుదాస్‌ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్‌ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్‌, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

 

Videos

YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది

India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్

ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!

Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ

YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్

కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు

CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు

Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు

ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ

Photos

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?

+5

'అఖండ 2 తాండవం' హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

పిక్నిక్‌ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌! (ఫోటోలు)

+5

ద్వారకాతిరుమల అనివేటి మండపంలో శిల్పకళా వైభవం (ఫొటోలు)

+5

చైతు-శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ప్రత్యేక ఫోటోలు

+5

సమంత రెండో పెళ్లి.. కొత్త ఫోటోలు వైరల్ (ఫొటోలు)

+5

నెల్లూరులో కుండపోత వర్షం (ఫొటోలు)