Breaking News

ఏఐ యుగంలో కావాల్సింది అదే..

Published on Wed, 12/03/2025 - 17:01

కృత్రిమ మేధ(ఏఐ) చాలా సాంకేతిక పనులను నిర్వహిస్తున్నందున ఉద్యోగ ప్రపంచంలో భావోద్వేగ మేధ(EQ), ట్రేడిషనల్‌ ఇంటెలిజెన్స్‌(సాంప్రదాయ మేధ IQ) కీలకమవుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అదే సమయంలో భావోద్వేగ మేధ లేకుండా సాంప్రదాయ మేధపై మాత్రమే ఆధారపడలేమని అభిప్రాయపడ్డారు. ఇటీవల యాక్సెల్ స్ప్రింగర్ సీఈఓ మాథియాస్ డాఫ్నర్‌తో జరిగిన ‘ఎండీ మీట్స్’ పోడ్‌కాస్ట్‌లో నాదెళ్ల ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘నాయకులకు కేవలం ఈక్యూ లేకుండా ఐక్యూ ఉంటే సరిపోదు. సమగ్ర నాయకత్వానికి ఈక్యూతోపాటు ఐక్యూ కావాల్సిందే.  ఏఐ సాంకేతిక పనులను ఎక్కువగా నిర్వహిస్తున్న తరుణంలో సాఫ్ట్‌ స్కిల్స్‌ కీలకంగా మారాయి. ఇది వ్యాపారంలో ముఖ్యమైన నైపుణ్యంగా, ఒక సూపర్‌ పవర్‌గా మారుతోంది. ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సహకారం, సంబంధాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి’ అని చెప్పారు.

ఏఐ రేసులో మెరుగైన పోటీ కోసం నాదెళ్ల మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో ఇటీవల అనేక కీలక మార్పులు చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో విజయం సాధించడానికి ఇటీవల క్లౌడ్‌ ఎక్స్‌పర్ట్‌ రోల్ఫ్ హార్మ్స్‌ను ఏఐ ఎకనామిక్స్ అడ్వైజర్‌గా నియమించారు. అక్టోబర్ 2025లో మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిజినెస్ సీఈఓని నియమించి తాను పూర్తిగా ఏఐ టెక్నికల్ అంశాలపై దృష్టి పెడుతున్నారు. కంపెనీ తమ కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్‌తో ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌(AGI) వైపు పయనిస్తోంది.

ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

Videos

YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది

India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్

ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!

Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ

YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్

కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు

CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు

Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు

ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ

Photos

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?

+5

'అఖండ 2 తాండవం' హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

పిక్నిక్‌ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌! (ఫోటోలు)

+5

ద్వారకాతిరుమల అనివేటి మండపంలో శిల్పకళా వైభవం (ఫొటోలు)

+5

చైతు-శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ప్రత్యేక ఫోటోలు