Breaking News

దేశంలోనే తొలిసారి ఎనిమిదేళ్ల పాపకు పాంక్రియాస్ శ‌స్త్రచికిత్స‌

Published on Wed, 12/03/2025 - 16:17

మ‌న శ‌రీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీల‌కం, అదే స‌మ‌యంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియ‌స్‌లో క‌ణితి ఏర్ప‌డితే చాలా ప్ర‌మాద‌క‌రం. కేవ‌లం ఎనిమిదేళ్ల వ‌య‌సులో అలాంటి ఇబ్బంది వ‌చ్చిన ఒక పాప‌కు.. సీత‌మ్మ‌ధార‌లోని కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు అత్యంత అధునాత‌న ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స చేసి, ఊర‌ట క‌ల్పించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన చీఫ్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టిన‌ల్, హెప‌టో-బైలియ‌రీ, పాంక్రియాటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ నంబాడ తెలిపారు.

"విశాఖ న‌గ‌రానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్ర‌మైన క‌డుపునొప్పితో ఆస్ప‌త్రికి వ‌చ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్‌ ఆచంట చలపతి రావు  ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా అరుదైన సాలిడ్ సూడోపాపిల‌రీ ఎపితెలియ‌ల్ నియోప్లాజ‌మ్ (స్పెన్‌) అనే పాంక్రియాటిక్ క‌ణితి ఉన్న‌ట్లు గుర్తించారు. భారత దేశంలో ఈ త‌ర‌హా స‌మ‌స్య‌కు శ‌స్త్రచికిత్స జ‌రిగిన అత్యంత చిన్న‌వ‌య‌సు రోగిగా ఈ పాప చ‌రిత్ర సృష్టించింది. పాప‌కు పాంక్రియాస్‌లో క‌ణితి ఉండ‌డం, అది అత్యంత అరుదైన‌ది కావ‌డంతో దాంట్లో క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నా, త‌ర్వాత ఎలాంటి సంక్లిష్ట స‌మ‌స్య‌లు రాకూడ‌దంటే శ‌స్త్రచికిత్స చేసి దాన్ని తొల‌గించాల‌ని నిర్ణ‌యించాం.

మూడు గంట‌ల పాటు అత్యంత క‌చ్చిత‌త్వంతో కీహోల్ స‌ర్జ‌రీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొద‌లుపెట్టాం వీలైనంత వ‌ర‌కు ర‌క్త‌స్రావం లేకుండా చూడ‌డంతో పాటు, పాంక్రియ‌స్ క‌ణ‌జాలాన్ని కూడా వీలైనంత వ‌ర‌కు కాపాడుకుంటూ క‌ణితి మొత్తాన్ని తొల‌గించ‌గ‌లిగాం. ఈ శ‌స్త్రచికిత్స త‌ర్వాత బాలిక చాలా త్వ‌ర‌గా కోలుకుంది. ఎలాంటి స‌మ‌స్య‌లు లేక‌పోవ‌డంతో ఐదు రోజుల్లోనే పాప‌ను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చ‌క్క‌గా రాణిస్తోంది. 

ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ క‌ణితుల‌ను తొల‌గించ‌డంలో ఉన్న నైపుణ్యాల‌కు ఈ శ‌స్త్రచికిత్సే నిద‌ర్శ‌నం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం".  అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. 

(చదవండి: అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?)

Videos

మోదీ-పుతిన్ వరుస భేటీలు.. కీలక ఒప్పందాలు సిద్ధం..!

రెపో రేటును తగ్గించిన RBI

భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్

జగన్ అనే వ్యక్తి లేకపోతే ఏపీ ఖేల్ ఖతం..

అఖండ-2 రిలీజ్ వాయిదా.. మద్రాస్ హైకోర్టు స్టే

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు

ఒకటేసారి పుట్టి.. ఒకే చోట చదివి.. ఒకటే శాఖల జాబ్ కొట్టిండ్రు

ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం

అయిందా.. బాగా అయిందా.. ఎందుకు ఈ ఎగస్ట్రాలు

Photos

+5

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)

+5

విశాఖ చేరుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్‌ సందడి (ఫొటోలు)

+5

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?